junior: శ్రీలీల.. జూనియర్ తెలుగు ట్రైల‌ర్ వ‌చ్చేసింది

ABN , Publish Date - Jul 11 , 2025 | 07:38 PM

గాలి జనార్థన్‌ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘జూనియర్‌’. శ్రీలీల కథానాయిక.

junior

గాలి జనార్థన్‌ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి (Kireeti Reddy) కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘జూనియర్‌’ (Junior). శ్రీలీల (Sreeleela) కథానాయిక. రాధాకృష్ణ దర్శకత్వంలో రజని కొర్రపాటి నిర్మించారు. జెనీలియా (Genelia) కీలకపాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు.ఇటీవ‌ల విడుద‌ల చేసిన పాట‌లు, టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు క్రియేట్ చేయ‌గా హీరో, శ్రీలీలల‌పై చిత్రీక‌రించిన పాట దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం అయింది. ఈ సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. ఈక్ర‌మంలో మేక‌ర్స్ మూవీ ట్రైల‌ర్ విడుదల చేశారు. ట్రైల‌ర్‌ను చూస్తే.. వినోదం, భావోద్వేగా కలబోతగా రూపొందించిన‌ట్లు అర్‌థ‌మ‌వుతోంది.

Updated Date - Jul 11 , 2025 | 07:38 PM