June Fight: స్టార్ హీరోస్ మధ్య బిగ్ వార్
ABN , Publish Date - Jun 02 , 2025 | 07:06 PM
జూన్ లో బిగ్ ఫెస్టివల్ కు రెడీ అవుతోంది. సమ్మర్ ముగిసినప్పటికి... అన్ సీజన్ లో తమ వంతు కాసులను రాబట్టుకునేందుకు మేకర్స్ ట్రై చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీలతో పాటు మీడియం, స్మాల్ బడ్జెట్ తేడా లేకుండా బరిలో నిలుస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫైట్ కు నలుగురు స్టార్ హీరోలు అందులోనూ మల్టీస్టారర్లతో రావడం హాట్ టాపిక్ గా మారింది.
జూన్ నెలలో ప్రధానంగా కమల్ హాసన్ (Kamal Haasan) , పవన్ కల్యాణ్ (Pawan Kalyan) , ధనుష్ (Dhanush) - నాగార్జున (Nagarjuna) , మంచు విష్ణు (Vishnu Manchu) మధ్య గట్టి పోటీ నెలకొనుంది. జూన్ 5న ‘థగ్ లైఫ్’ (Thug Life) రిలీజ్ కానుంది. డబ్బింగ్ మూవీ అయినప్పటికి... తెలుగులోను సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. పైగా కమల్, శింబు నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటు ఇక మధ్యలో సంతోష్ శోభన్ నటించిన 'గ్యాంబ్లర్స్' (Gamblers ) జూన్ 6న విడుదల కానుంది. అదే రోజున నార్నే నితిన్ మూవీ 'శ్రీశ్రీశ్రీ రాజావారు' (Sri Sri Sri Raja Vaaru) వస్తోంది. ఇదే రోజున 'సత్యం' రాజేశ్ (Satyam Rajesh) నటించిన 'పాడేరు 12వ మైలురాయి' (Paderu 12th Mile )కూడా వస్తోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) జూన్ 12 న విడుదల కానుంది. ఈ మూవీలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ హీరో బాబీ డియోల్ (Bobby Deol ) నటిస్తున్నాడు. నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పోస్టర్లు, పాటలు సినిమా పై పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేశాయి.
జూన్ 20న ధనుష్, నాగార్జున కాంబోతో తెరకెక్కిన మూవీ 'కుబేర' (Kubera) బాక్సాఫీస్ లో సందడి చేయనుంది. ఇదే రోజు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన '8 వసంతాలు' (8 Vasanthalu) మూవీ విడుదల అవుతుండటం విశేషం. ఇక జూన్ 27 చివరి వారంలో మంచు విష్ణు ‘కన్నప్ప’(Kannappa) తో వచ్చేస్తాడు. భారీ క్యాస్టింగ్ తో అతను రేస్ లోకి దిగుతున్నాడు. ప్రభాస్(Prabhas) , అక్షయ్ కుమార్ (Akshay Kumar), మోహన్ లాల్ (Mohanlal)వంటి స్టార్స్ ఇందులో నటిస్తుండంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అలానే విజయ్ ఆంటోని(Vijay Antony) నటించిన 'మార్గన్' (Maargan)మూవీ కూడా తెలుగులో అదే రోజున విడుదల అవుతోంది. మరి జూన్ లో వీరిలో విజేతగా ఎవరు నిలుస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.