Narne Nithin : ఘనంగా ఎన్టీఆర్ బావమరిది పెళ్లి
ABN , Publish Date - Oct 11 , 2025 | 09:20 AM
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది, యంగ్ హీరో నార్నె నితిన్ ఓ ఇంటివాడయ్యాడు. శుక్రవారం రాత్రి తాళ్లూరి కృష్ణప్రసాద్, స్వరూప దంపతుల కుమార్తె లక్ష్మీ శివానితో ఆయన వివాహం ఘనంగా జరిగింది
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది(Ntr), యంగ్ హీరో నార్నె నితిన్ (Narne nithin) ఓ ఇంటివాడయ్యాడు. శుక్రవారం రాత్రి తాళ్లూరి కృష్ణప్రసాద్, స్వరూప దంపతుల కుమార్తె లక్ష్మీ శివానితో (Lakshmi shivani) ఆయన వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ శివార్లలోని శంకర్‌పల్లిలో జరిగిన వివాహ వేడుకలో ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతి అతిథుల్ని ఆహ్వానించారు. బంధువులు, సన్నిహితులు ప్రముఖుల సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఇద్దరు ఒకటయ్యారు
ఎన్టీఆర్ బావమరిదిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు నితిన్. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తమ్ముడే నార్నె నితిన్. 'శ్రీశ్రీశ్రీ రాజావారు' సినిమాతో ఎంట్రీ ఇచ్చినా .. దానికన్నా ముందు 'మ్యాడ్' సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయం అందుకోవడంతో మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆయ్, మ్యాడ్ స్క్వేర్ తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ వేడుకలో తారక్ లుక్ చాలా కొత్తగా ఉంది. గుబురు గడ్డం, స్లిమ్ పర్సనాలిటీతో ఎంతో అందంగా కనిపించాడు. డ్రాగన్ సినిమా కోసం మెయింటైన్ చేస్తున్న లుక్ లా కనిపిస్తుంది.