NTR Jayanthi: ఎన్టీఆర్ ఘాట్ వద్ద.. తాతకు నివాళులర్పించిన జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
ABN , Publish Date - May 28 , 2025 | 08:51 AM
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు 102వ జయంతి (May 28) సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానులు తెదేపా నేతలు బుధవారం ఆయనకు నివాళులర్పించారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao). 102వ జయంతి (May 28) సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు తెదేపా నేతలు బుధవారం ఆయనకు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ ఎన్టీఆర్‌కు అంజలి ఘటించారు (NTR Birth Anniversary).
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కల్యాణ్ రామ్ (Kalyan Ram) సొదరులు ఇరువురు తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ (NTR Ghat)ని సందర్శించి ఘూట్‌పై పూలు చల్లి నివాళులర్పించారు. అపంతరం అక్కడే కూర్చోని తాత ఎన్టీఆర్‌ని గుర్తు చేసుకున్నారు. ఇంతుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.