War 2: టీజర్ గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమంటున్నారు...
ABN , Publish Date - May 22 , 2025 | 03:31 PM
ఈ యేడాది యంగ్ టైగర్ యన్టీఆర్ ఏకైక సినిమా 'వార్ 2' అనే చెప్పాలి... ఈ మూవీపై మొన్నటి దాకా విపరీతమైన క్రేజ్ నెలకొని ఉండేది... కానీ, యన్టీఆర్ బర్త్ డే కు వచ్చిన టీజర్ చూసిన తరువాత ఆ క్రేజ్ కరిగిపోతోందని టాక్... ఇంతకూ ఏమిటి సంగతి!?
యంగ్ టైగర్ యన్టీఆర్ కీ రోల్ లో రూపొందిన తొలి హిందీ చిత్రం 'వార్ 2'... హృతిక్ రోషన్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో యన్టీఆర్ ప్రధాన భూమిక పోషించారు... ఆగస్టు 14న ఈ మూవీ జనం ముందుకు రానుంది... అలా డేట్ ప్రకటించారో లేదో ఇలా తెలుగు వెర్షన్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది... ఎందుకంటే ఈ యేడాది యన్టీఆర్ నటించిన ఏకైక చిత్రంగా 'వార్ 2' వస్తోంది... దాంతో తెలుగునాట 'వార్ 2'కు బజ్ క్రియేట్ అయింది... ఈ సినిమా తెలుగు వర్షన్ రైట్స్ 85 కోట్ల దాకా పలికాయి... అయితే ఈ చిత్రం నిర్మించిన యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ వంద కోట్ల దాకా డిమాండ్ చేసింది... అక్కడి దాకా బాగానే ఉంది... కానీ, యన్టీఆర్ బర్త్ డే కు రిలీజయిన 'వార్ 2' టీజర్ చూశాక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంతకు వచ్చిన బజ్ నీరుకారిపోయిందని తెలుస్తోంది...
'వార్ 2'లో యన్టీఆర్ నటించడం వల్లే ఆ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది... అయితే ఈ సినిమా టీజర్ చూశాక, ఆ చిత్రంలో యన్టీఆర్ కు అంత ప్రాధాన్యత లేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు... అసలు ఇందులో యన్టీఆర్ ఇద్దరు హీరోల్లో ఒకరా? లేక విలన్ గా నటించాడా? అన్న అనుమానాలూ కొందరిలో పొడసూపాయి... అంతేకాదు, ఈ టీజర్ లో కొత్తదనం భూతద్దం వేసి చూసినా కనిపించలేదని ఫ్యాన్స్ అంటున్నారు... యన్టీఆర్ విజువల్స్ అన్నీ రొటీన్ గా ఉన్నాయని వారి మాట! ఇక టీజర్ లోనే హృతిక్ రోషన్ డామినేషన్ కనిపిస్తోందనీ ఫ్యాన్స్ వాపోతున్నారు... హీరోలను మించి కొన్ని క్షణాలే తళుక్కుమన్న కియారా అద్వానీ టూ బికినీ విజువల్స్ కుర్రకారును భలేగా ఆకట్టుకుంటున్నాయి... ఈ నేపథ్యంలో 'వార్ 2'లో యన్టీఆర్ నటించి తప్పు చేశాడా అన్న అనుమానాలూ పొడసూపుతున్నాయి...
యన్టీఆర్ హిందీలో నటించడం ఇదే మొదటిసారి కాదు. ఆ మాటకొస్తే తన తాత నటరత్న యన్టీఆర్ దర్శకత్వంలో హిందీ 'బ్రహ్మర్షి విశ్వామిత్ర'లో మొట్టమొదటిసారి హిందీ తెరపై తళుక్కుమన్నాడు జూనియర్... ఆ సినిమా అతి కొద్ది సెంటర్స్ లోనే వెలుగు చూసింది... అందువల్ల యన్టీఆర్ కీ రోల్ పోషించిన 'వార్ 2'నే ఆయన మొదటి సినిమాగా అభిమానులు భావించారు... ఈ మూవీ టీజర్ చూశాక, ఇందులోనూ ఆయనకు అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ వాపోతున్నారు... అదీగాక టీజర్ రాకముందు 'వార్ 2' తెలుగు వర్షన్ బిజినెస్ కు ఉన్న క్రేజ్ కాస్తా కరిగిపోయి, ఇప్పుడు సగానికి సగం తగ్గించి ఇస్తే తీసుకుంటామని కొనుగోలు దారులు అంటున్నారట! లేకపోతే తమకు వర్కవుట్ కాదనీ బయ్యర్స్ తెగేసి చెబుతున్నారట! దీంతో యన్టీఆర్ తప్పులో కాలేశాడని చాలామంది అంటున్నారు.. ఆగస్టు 14న 'వార్ 2' సినిమా వచ్చే దాకా ఏమీ తెలియదని, అప్పుడే అసలు విషయం బయటపడుతుందని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి... ఏమవుతుందో చూడాలి...
Also Read: Peddi: పెద్ది మరో అప్టేట్.. భారీ యాక్షన్ సీన్ల చిత్రీకరణ
Also Read: Theatre Bandh: మూడు సెక్టార్స్ తో మీటింగ్
Also Read: Spirit: ప్రభాస్ మూవీ నుండి తప్పుకున్న దీపిక...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి