NTR - Neel Update: డ్రాగన్‌ నుంచి అదిరే అప్‌డేట్‌..

ABN, Publish Date - May 08 , 2025 | 10:13 PM

ఎన్టీఆర్‌ (NTR) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే!

ఎన్టీఆర్‌ (NTR) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! 'డ్రాగన్‌' (Dragon) వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవత షెడ్యూల్‌ మొదలైంది. హీరోతోపాటు ఇతర తారాగణంతోపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం గురించి టీమ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది.

ఈ సినిమా తొలి షెడ్యూల్‌ కర్ణాటకలో జరుగుతోంది. అయితే ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ పూర్తయినట్లు ఓ ఫొటో షేర్‌ చేసి తెలిపారు. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించనట్లు తెలిసింది. ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా కన్నడ భామ రుక్మిణీ వసంత్‌ నటిస్తోంది. మైత్రీ మూవీమేకర్స్‌ సంస్థ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది.

Updated Date - May 08 , 2025 | 10:13 PM