War 2 Trailer: ఇద్దరు వీరుల యుద్ధం

ABN , Publish Date - Jul 26 , 2025 | 02:32 AM

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్‌ 2 ట్రైలర్‌ వచ్చేసింది. జూనియర్‌ ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ నటించిన..

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వార్‌-2’ ట్రైలర్‌ వచ్చేసింది. జూనియర్‌ ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ నటించిన ఈ భారీ యాక్షన్‌ చిత్రానికి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ బేనర్‌పై ఆదిత్య చోప్రా పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మించారు. కియారా అద్వానీ కథానాయిక. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. తెలుగులో ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ విడుదల చేస్తోంది. కాగా, ఇద్దరు వీరులు యుద్ధానికి తలపడితే ఎలా ఉంటుందో ట్రైలర్‌లో చూపించారు. కియారా అద్వానీ కూడా కొన్ని యాక్షన్‌ సన్నివేశాలతోపాటు గ్లామర్‌ సీన్లలో కనిపించారు.

Updated Date - Jul 26 , 2025 | 02:32 AM