Jatadhara: జటాధరుడికి.. జో లాలి! మంచి అమ్మ పాట
ABN , Publish Date - Oct 26 , 2025 | 08:41 AM
సుధీర్ బాబు (Sudheer Babu), సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కించిన సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’.
సుధీర్ బాబు (Sudheer Babu), సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ప్రధాన పాత్రధారులుగా దర్శకద్వయం వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ తెరకెక్కించిన సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’ (Jatadhara). జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సంస్థలు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేశ్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్ నిర్మించారు. నవంబరు 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఈ కోవలో తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ‘జో లాలి జో...’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. శ్రీమాన్ కీర్తి (Sriman Keerthi) సాహిత్యం అందించగా రాజీవ్ రాజ్ అద్భుతమైన స్వరాలు సమకూర్చారు. పావని వాసా (Pavani Vasa), రాజీవ్ రాజ్ (Rajeev Raj) మైమరిపించేలా ఆలపించారు.