JIGRIS: జిగ్రిస్ ట్రైల‌ర్‌.. అదిరిపోయిందంతే! ఈ న‌గ‌రానికి.. మించి

ABN , Publish Date - Nov 09 , 2025 | 11:07 PM

ఈ న‌గ‌రానికి ఏమైంది, హుషారు సినిమాల‌ను మించి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు జిగ్రిస్ అనే సినిమా రెడీ అయింది.

JIGRIS

రామ్ నితిన్ (Ram Nithin), కృష్ణ బురుగుల (Krishna Burugula), మణి వక (Mani Vaka), ధీరజ్ ఆత్రేయ (Dheeraj Athreya) కీలక పాత్రల్లో నటించిన చిత్రం జిగ్రీస్(Jigris). హరీష్ రెడ్డి ఉప్పుల (Harish Reddy Uppula) దర్శకత్వం వహించ‌గా మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మించారు. న‌వంబ‌ర్ 14న ఈ చిత్రం థియేట‌ర్ల‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన టీజర్, పాట‌లు ఒక‌దాన్ని మించి మ‌రోటి మంచి జ‌నాధ‌ర‌ణ‌ను ద‌క్కించుకుంది. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)కు ఈ మూవీ నిర్మాత స్నేహితుడు కావ‌డంతో వంగా స్వ‌యంగా ప్ర‌మోష‌న్ల‌లోకి దిగ‌డం విశేషం.

కాగా.. ఈ సినిమా విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్‌ తాజాగా ఆదివారం రాత్రి ఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్‌ను చూస్తే.. ఈ న‌గ‌రానికి ఏమైంది, హుషారు సినిమాల‌ను మించి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇవ్వ‌డం గ్యారెంటీ అనేలా ఉంది. హైద్రాబాద్ టు గోవా ట్రిప్ నేప‌థ్యంలోనే వ‌స్తున్న ఈ చిత్రంలో నలుగురు చిన్న నాటి మిత్రుల జ‌ర్నీ ఔట్ అండ్ ఔట్ ఫుల్ ఫ‌న్‌, ఎమోష‌న్ రైడ్‌గా ఉంది. డైలాగ్స్ అదిరిపోయాయి. నా ఫ్రెండ్‌కు క్యాన్స‌ర్ తాగి గోవాకు వ‌చ్చినం, మ‌త్తుల గో నాలాంటి కొడుకు నాకు ఉంటే ఎప్పుడో చంపి ప‌డ‌దొబ్బుతుండే.. మా అయ్య దేవుడురా అంటూ సాగే డైలాగుల‌తో ట్ఐల‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంది.

Updated Date - Nov 09 , 2025 | 11:07 PM