Ghattamaneni Jayakrishna: 'శ్రీనివాస మంగాపురం'.. అంటున్న కృష్ణ మనువడు
ABN , Publish Date - Nov 27 , 2025 | 09:26 PM
జయకృష్ణ ఘట్టమనేని తొలి చిత్రానికి 'శ్రీనివాస మంగాపురం' టైటిల్ ను ఖరారు చేశారు. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో రవీనా టాండన్ కుమార్తె టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.
సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) మనవడు, రమేశ్ బాబు (Rameshbabu) తనయుడు జయకృష్ణ (Jayakrishna) హీరోగా అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ సమర్పణలో ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని పి. కిరణ్ నిర్మిస్తున్నాడు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాశ్ కుమార్ (G.V. Prakash Kumar) దీనికి సంగీతం అందిస్తున్నాడు.
అయితే.... ఈ సినిమా వివరాలు బయటకు వచ్చిన దగ్గర నుండి దీనికి 'శ్రీనివాస మంగాపురం' అనే పేరు పెడతారని ప్రచారం జరిగింది. తాజాగా అదే పేరును ఖరారు చేస్తూ, లోగోనూ సైతం చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ప్రేమకథ మీ హృదయాలలో చిరకాలం నిలిచిపోతుందని దర్శకుడు అజయ్ భూపతి తెలిపాడు. ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించడంతో కృష్ణ, మహేశ్ బాబు (Mahesh Babu) అభిమానులంతా ఆ శ్రీనివాసుడి దయతో జయకృష్ణ తొలి చిత్రంతోనే సూపర్ హిట్ ను అందుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు.