Subham: సమంత ‘శుభం’ నుంచి.. ‘జన్మజన్మలబంధం’ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్
ABN , Publish Date - May 03 , 2025 | 07:01 PM
దక్షిణాది అగ్ర కథనాయిక సమంత కాస్త విరామం తర్వాత ప్రేక్షకుల ముందు కనిపించనున్న చిత్రం శుభం. తాజాగా జన్మజన్మల బంధం అంటూ సాగే ఓ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేశారు.
దక్షిణాది అగ్ర కథనాయిక సమంత (Samantha) కాస్త విరామం తర్వాత ప్రేక్షకుల ముందు కనిపించనున్న చిత్రం శుభం (Subham). మొదటి ప్రయత్నంగా సమంత తన సొంత బేనర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ (Tralala Moving Pictures)పై ఈ సినిమాను నిర్మించడంతో పాటు ఓ ప్రత్యేక పాత్రలో సైతం నటించింది. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మే9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమాలు వేగం చేస్తూ తాజాగా జన్మజన్మల బంధం అంటూ సాగే ఓ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేశారు.
ఈ పాటకు షోర్ పోలీస్, జైన్ బాక్స్‌వాలా, అభిరామ్ మహంకాళి సాహిత్యం అందించగా బియాంకా గోమ్స్, జైన్ బాక్స్‌వాలా ఆలపించారు. షోర్ పోలీస్ సంగీతం అందించాడు. ఈ పాటలో సినిమాలోని ప్రధాన తారాగణంతో పాటు సమంత స్టెప్పులు వేయడం విశేషం. ప్రస్తుతం ఈ పాట నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. ప్రవీణ్ కాండ్రేగుల ( Praveen Kandregula) దర్శకత్వం వహించాడు. హర్షిత్ రెడ్డి (Harshith Reddy), శ్రీయ కోంతం (Shriya Kontham), శ్రీనివాస్ (Gavireddy Srinivas) కీలక పాత్రలు పోషించారు.