Itlu mee vedava: రెండు సంస్థల ద్వారా  ప్రేక్షకుల ముందుItlu Mee Vedava: కు వస్తున్నా'ఇట్లు మీ ఎదవ'.. 

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:46 AM

త్రినాధ్ కఠారి హీరోగా స్వీయ దర్శకత్వంలో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా  తెరకెక్కుతున్న చిత్రం 'ఇట్లు మీ ఎదవ'. 'వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు' అనేది ట్యాగ్ లైన్. సాహితీ అవాంచ కథానాయిక.

త్రినాధ్ కఠారి (trinath Katari) హీరోగా స్వీయ దర్శకత్వంలో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా  తెరకెక్కుతున్న చిత్రం 'ఇట్లు మీ ఎదవ'. 'వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు' అనేది ట్యాగ్ లైన్. సాహితీ అవాంచ కథానాయిక. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మిస్తున్నారు.  తాజాగా సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ నెల 21న ఈ సినిమా విడుదల కానుంది. నైజాంలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP విడుదల చేయనుండగా, ఆంధ్ర, సీడెడ్ లో  ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ రిలీజ్ చేయనుంది.

ఈ రెండు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. R P పట్నాయక్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రానికి  జగదీష్ చీకటి డీవోపీ, ఎడిటర్ ఉద్ధవ్ SB. 

 

Updated Date - Nov 16 , 2025 | 11:46 AM