Manchu Vishnu: కన్నప్ప రిలీజ్ వేళ..మంచి విష్ణుకు బిగ్ షాక్

ABN , Publish Date - Jun 25 , 2025 | 06:43 PM

మంచు విష్ణు (Manchu Vishnu)కు బిగ్ షాక్ తగిలింది. రెండు రోజుల్లో కన్నప్ప (Kannappa) సినిమా రిలీజ్ కానున్న వేళ.. విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Manchu Vishnu

Manchu Vishnu: మంచు విష్ణు (Manchu Vishnu)కు బిగ్ షాక్ తగిలింది. రెండు రోజుల్లో కన్నప్ప (Kannappa) సినిమా రిలీజ్ కానున్న వేళ.. విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ దాడులు సడెన్ గా ఎందుకు జరుగుతున్నాయి అనేది తెలియదు. కానీ, ప్రస్తుతం అధికారులు మంచు విష్ణు నివాసంతో పాటు ఆఫీస్ లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారని టాక్ నడుస్తోంది. కన్నప్ప సినిమాకు అయిన బడ్జెట్ వివరాలు పై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.


మంచు విష్ణు హీరోగా చిత్రం కన్నప్ప. వంద కోట్ల బడ్జెట్ తో మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. స్టార్ హీరోలందరూ ఈ సినిమాలో క్యామియోలలో నటించారు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి రిలీజైన ప్రమోషన్ కంటెంట్ అంతా సినిమాపై అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా ప్రభాస్ కూడా నటిస్తుండడంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. జూన్ 27 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు రోజుల్లో రిలీజ్ పెట్టుకొని సడెన్ గా ఈ ఐటీ దాడులు ఏంటి.. ? అనే అనుమానం నెటిజన్స్ లో రేకెత్తిస్తోంది.


ఇక ఈ వార్త విన్న కొందరు నెటిజన్స్.. ఈ దాడులు మొత్తం పబ్లిసిటీ స్టంట్ అని చెప్పుకొస్తున్నారు. మంచు విష్ణు కావాలనే ఈ దాడులను చేయిస్తున్నాడని, లేకపోతే విష్ణు ఇంటివద్ద లేని సమయంలో ఈ దాడులు జరగడం ఏంటి.. ? సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి ఇదొక చీప్ ట్రిక్ అని పెదవి విరుస్తున్నారు. ఇండస్ట్రీలో ఇలాంటివి చాలానే చూశామని, అసలు ఇలాంటి ట్రిక్స్ ఏమి లేకుండా కథ బావుంటే ప్రేక్షకులు వస్తారు అని చెప్పిన మంచు ఫ్యామిలీ ఇప్పుడు ఈ విధంగా ప్రమోషన్ స్టంట్ చేయడం చీప్ గా ఉందని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ దాడులపై మంచు విష్ణు ఎలా స్పందిస్తాడో చూడాలి.

Updated Date - Jun 25 , 2025 | 06:43 PM