3 Roses Season 2: 'త్రీ రోజెస్ సీజన్ 2' ముచ్చట్లు ఇషా.. హర్ష మాటల్లో
ABN , Publish Date - Dec 09 , 2025 | 05:59 PM
ఇంతకు ముందు చేసిన 'త్రీ రోజెస్' వెబ్ఆ సిరీస్ కు కొనసాగింపుగా 'త్రీ రోజెస్-2' (three Roses 2) వస్తుంది. ఈ నెల 12వ తేదీ నుంచి Ahaలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు. ఎస్కేఎన్ నిర్మాత.
'కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు మూవీస్ గతంలో చాలా తక్కువగా వచ్చేవి. ఇప్పుడు వాటి సంఖ్య పెరిగింది. ఫీమేల్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్ వస్తే నన్ను నేను అందులో రిలేట్ చేసుకోగలిగితే నటించేందుకు ఒప్పుకుంటా. లాక్ డౌన్ లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. యాక్షన్ మూవీస్ లో అవకాశం వస్తే నటిస్తా' అంటున్నారు ఈషా రెబ్బా (Isha Redda)
ఇంతకు ముందు చేసిన 'త్రీ రోజెస్' వెబ్ఆ సిరీస్ కు కొనసాగింపుగా 'త్రీ రోజెస్-2' (three Roses 2) వస్తుంది. ఈ నెల 12వ తేదీ నుంచి Ahaలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు. ఎస్కేఎన్ నిర్మాత. మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రచారంలో భాగంగా హీరోయిన్ ఈషా రెబ్బా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
త్రీ రోజెస్' సీజన్ 2లో నేను కంటిన్యూ కావడం హ్యాపీగా ఉంది. సీజన్ 1లో ఫీమేల్ క్యారెక్టర్స్ కు వేర్వేరు సీన్స్ ఉంటాయి. ఈ సీజన్ 2లో ఆ క్యారెక్టర్స్ అన్నింటికి కలిపి కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. నేను, రాశీ, కుషిత మూడు కీ రోల్స్ చేశాం. రాశీ ఫైర్ బ్రాండ్ లా ఉంటుంది. కుషిత చిన్న పిల్లలా అల్లరి చేస్తుంది. వీళ్లిద్దరితో కలిసి నటించడం ఎంజాయ్ చేశాను. ఈ సిరీస్ లో గ్లామర్ డోస్ పెంచలేదు. యూత్ ఫ్యామిలీ అంతా కలిసి సిరీస్ చూడొచ్చు. సీజన్ 2లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ 30 నిమిషాల నిడివితో సాగుతుంది. సీజన్ 3కి లీడ్ ఇస్తూ సీజన్ 2 కంప్లీట్ అవుతుంది. నేను హర్ష చేసిన సీన్స్ అంత వైరల్ అవుతాయని మేము సీజన్ 1 చేసేటప్పుడు అనుకోలేదు. జీరో ఎక్స్ పెక్టేషన్స్ తో నటించాం. సీజన్ 2లో ఇంకా బాగా కాన్ఫిడెంట్ గా చేశాం. ఈ వెబ్ సిరీస్ మా కెరీర్ లో ఒక స్పెషల్ ప్రాజెక్ట్ గా మిగిలిపోతుంది.
గర్ల్స్ అంతా కలిసి ఒక దగ్గర రెంట్ కు ఉండటం, వాళ్లు కలిసి సరదాగా కుకింగ్, గాసిప్స్ చెప్పుకోవడం, లైఫ్ లీడ్ చేయడం అనేది ఈ సీజన్ 2లో నేను పర్సనల్ గా బాగా కనెక్ట్ అయిన పాయింట్. గతంలో మా గర్ల్స్ గ్యాంగ్ లో నేను కూడా అలా ఉన్నాను. 'ఓం శాంతి శాంతి శాంతి:' సినిమా సంక్రాంతి అయ్యాక జనవరి 23న రిలీజ్ చేస్తున్నారు. సినిమా అప్పటికే కంప్లీట్ అయి ఉన్నా రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేశాం. తెలుగులో కొన్ని ప్రాజెక్ట్స్ కు డిస్కషన్స్ జరుగుతున్నాయి. తమిళంలో ఒక మూవీ చేస్తున్నా'
హర్ష చెముడు మాట్లాడుతూ
మొదటి సీజన్లో రివేంజ్ ను ఈ సీజన్ 2 లో తీర్చుకునేందుకు నేను ప్రయత్నిస్తుంటాను. ఈషా, నా క్యారెక్టర్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తాయి. మన తెలుగు వెబ్ సిరీస్లకు చూసుకుంటే ఇది పక్కా సీక్వెల్.
వెబ్ సిరీస్ లలో కొన్నింటికి ఒక్కో ఎపిసోడ్ కు ఒక్కో డైరెక్టర్ ఉంటారు. ఈ సీజన్ 2కు కొత్త డైరెక్టర్ కిరణ్ వర్క్ చేశారు. అయితే రైటర్ టీమ్ మారలేదు. సిరీస్ అంతా ఎంటర్ టైనింగ్ గా సరదాగా ఉంటుంది. లైఫ్, రిలేషన్ షిప్స్, ఫ్రెండ్ షిప్ గురించి మంచి విషయాలు కూడా ఉంటాయి. అయితే అవి సందేశాలు ఇచ్చినట్లు చూపించలేదు.
మాతో పాటు సుదర్శన్, సత్య, ప్రభాస్ శ్రీను గారు..ఇలా చాలా మంది మంచి కాస్టింగ్ ఉన్నారు. క్యారెక్టర్ బాగుంటే లీడ్ క్యారెక్టర్ , చిన్న క్యారెక్టర్ అనే తేడాలు చూడను. సాయి రాజేశ్ గారి ప్రొడక్షన్ లో ఒక మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నా. ప్రభాస్ గారి రాజా సాబ్ లోనూ ఒక రోల్ చేశా. కీలకమైన సన్నివేశంలో నా పాత్ర ఉంటుంది. ఫలానా హీరోతో పనిచేయాలి అనే లిస్టు చాలా పెద్దది. అందరితో వర్క్ చేయాలని ఉంది. ఈ సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాల్లో నటించా.