Bhatti Vikramarka: గద్దర్ అవార్డ్స్.. దేశ వ్యాప్తంగా సినీ నటులను ఆహ్వానించండి!

ABN , Publish Date - Jun 10 , 2025 | 09:54 PM

గద్దర్ అవార్డ్స్ కార్యక్రమానికి తెలుగు సినిమాతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సినీ నటులను గుర్తించి ఆహ్వానించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.

telangana

హైదరాబాద్ నగరాన్ని.. సినిమా సిటీకి రాజధానిగా మార్చేందుకు అవసరమైన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం, మంత్రుల సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క (Bhatti Vikramarka Mallu) సమాచార శాఖ కమిషనర్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. మంత్రులు, సబ్ కమిటీ సభ్యులైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy), దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ( Sridhar Babu Duddilla), ఎఫ్‌డీసీ చైర్మ‌న్ దిల్ రాజు (DilRaju) సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. హైదరాబాదును సినిమా సిటీగా అభివృద్ధి చేసి, దేశ, విదేశాల నుంచి సినిమా రంగ ప్రముఖులను ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం తెలిపారు.

GtFwGhwbQAApqnO.jpg

ప్రస్తుతం రాష్ట్రంలో సినిమా షూటింగ్ చేయాలంటే పోలీసు శాఖ, అగ్నిమాపక శాఖ, మున్సిపల్ శాఖ వంటి వివిధ శాఖల నుంచి విడివిడిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంది, ఫలితంగా సినీ పరిశ్రమ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు, ఈ సమస్యను పరిష్కరించాలని సబ్ కమిటీ నిర్ణయించింది. వివిధ శాఖల నుంచి ఇవ్వాల్సిన అనుమతులను ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్‌లో ఒక అధికారిని నియమించి వారి ద్వారా అన్ని శాఖల నుంచి అనుమతులు త్వరితగతన ఇప్పించేలా సింగిల్ విండో పద్ధతిని ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాల్లో షూటింగులు జరగడం మూలంగా పర్యాటక రంగం అభివృద్ధికి అవకాశం ఉందని తెలిపారు. సినిమా థియేటర్లలో క్యాంటీన్ల ద్వారా విక్రయిస్తున్న తినుబండారాలు ఇతర వస్తువులు అత్యధిక రేట్లకు విక్రయిస్తున్నారు సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

GtFwGhsaYAEh3KV.jpg

ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు గతంలో రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాలు మంజూరు చేసింది, ప్రస్తుతం ఆ భూమి పరిస్థితి వాటి వివరాలను వచ్చే సమావేశం నాటికి తీసుకురావాలని సబ్ కమిటీ అధికారులను ఆదేశించారు. సినీ కార్మికుల కోసం నిర్మించిన చిత్రపురి కాలనీపై ఏర్పాటుచేసిన RCS కమిటీనీ వచ్చే సమావేశానికి పిలిపించాలని సూచించారు. ఈనెల 14న ఏర్పాటు చేస్తున్న తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ (Gaddar Film Awards) ఫంక్షన్‌ను న భూతో.. న భవిష్యత్తు అన్నట్టుగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం సూచించారు.

ఈ కార్యక్రమానికి తెలుగు సినీ రంగ ప్రముఖుల అందరిని ఆహ్వానించాలని, తెలుగు సినిమాతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సినీ నటులను గుర్తించి ఆహ్వానించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. సమావేశంలో Fdc చైర్మన్ దిల్ రాజు, హోం శాఖ స్పెషల్ సిఎస్ రవి గుప్తా, సమాచార శాఖ కమిషనర్ హరీష్, ఎఫ్డిసి డైరెక్టర్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 09:54 PM