Globe trotter: పాస్‌పోర్ట్‌ తరహా ఎంట్రీ పాస్‌.. ఇన్నోవేటివ్‌ థాట్స్‌ జక్కన్నకే సాధ్యం..

ABN , Publish Date - Nov 14 , 2025 | 10:57 AM

మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి (Ss Rajamouli) దర్శకత్వంలో భారీ యాక్షన్‌ అడ్వెంచర్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి (Ss Rajamouli) దర్శకత్వంలో భారీ యాక్షన్‌ అడ్వెంచర్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'ఎస్‌ఎస్‌ఎంబీ29' వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీదుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కె.ఎల్‌ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దర్శకుడు రాజమౌళి ఈ చిత్రానికి సంబంధించి ఏ సమాచారం లేకుండా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ప్రియాంక చోప్రా లుక్‌లతోపాటు సంచారి పాటను విడుదల చేసి సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నారు. ఈ నెల 15న రామోజీ ఫిల్మ్‌ సిటీ ఈ చిత్రానికి సంబంధించి ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జియో హాట్‌స్టార్‌లో ఈ వేడుక స్ట్రీమింగ్‌ కానుంది. దీనికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈవెంట్‌ను వీక్షించడానికి వచ్చే అభిమానులు, ప్రేక్షకుల కోసం చిత్ర బృందం ప్రత్యేకంగా పాస్‌లు సిద్దం చేసింది. పాస్‌పోర్ట్‌ తరహాలో తీర్చిదిద్దిన ఈ పాస్‌లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇన్నోవేటివ్‌ థాట్‌తో..

మహేశ్‌కు సంబంధించి ఆయన పుట్టినరోజులు విడుదల చేసిన ప్రీలుక్‌లో ధరించిన త్రిశూలం బొమ్మతో ప్రింట్‌ చేసిన పాస్‌లో లోపల పేజీలో మహేశ్‌, ప్రియాంక, పృథ్వీరాజ్‌, రాజమౌళి ఫొటోలను, ఈవెంట్‌కు వచ్చేవారు పాటించాల్సిన సలహా, సూచనలు, రూట్‌ మ్యాప్‌ అందులో ఉంచారు. ప్రస్తుతం ఈ ఇన్విటేషన్‌ ప్రేక్షకుల్ని ఆకర్షిస్తోంది.
అంతే కాదు ఈ కార్యక్రమానికి వచ్చే ప్రేక్షకులకు జాగ్రత్తలు చెబుతూ రాజమౌళి గురువారం ఓ ప్రత్యేక వీడియో కూడా విడుదల చేశారు. ఆ ఈవెంట్‌కు పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారని, పాస్‌ లేకుండా వచ్చి ఇంబ్బందులకు గురి కావొద్దని రాజమౌళి స్పష్టం చేశారు. ఈ ఇన్విటేషన్‌ చూసి రాజమౌళి ఆలోచనలు.. ప్లానింగ్‌ నెక్ట్స్‌ లెవల్‌ అంటూ, నీ ఇన్నోవేటివ్‌ థాట్స్‌ వర్త్‌ జక్కన్న వర్త్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.
 

Updated Date - Nov 14 , 2025 | 10:57 AM