Actress Indraja: వారికి పుట్టగతులు ఉండవు.. సర్వనాశనం అయిపోతారు
ABN , Publish Date - Dec 05 , 2025 | 07:30 PM
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఇంద్రజ (Indraja) జబర్దస్త్ పుణ్యమా అంటూ మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది.
Actress Indraja: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఇంద్రజ (Indraja) జబర్దస్త్ పుణ్యమా అంటూ మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. జడ్జిగా రెండు మూడు ఎపిసోడ్స్ చేసి.. తన మంచితనంతో పర్మినెంట్ జడ్జిగా మారిపోయింది. ఈ షో తరువాత ఆమె ఒక పక్క షోస్ తో ఇంకోపక్క సినిమాలతో బిజీగా మారింది. జడ్జిగా ఉండడంతో అందరూ ఆమెను అమ్మ.. అమ్మ అని పిలుస్తూ ఇంద్రజమ్మగా మార్చేశారు. ప్రస్తుతం ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది.
రీఎంట్రీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్లు ఒక్క షోలో ఫేమస్ అయితే చిన్న చిన్న బట్టలు వేసుకొని, నోటికి ఏది వస్తే అది మాట్లాడి ట్రోల్ అవుతున్న ఇండస్ట్రీలో కట్టుబొట్టు.. మాటతీరుతో ఎక్కడా హుందాతనం పోగొట్టుకోకుండా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది ఇంద్రజ. తాజాగా ఇంద్రజ ఒక టాక్ షోకి గెస్ట్ గా విచ్చేసింది. ఈ షోలో ఇంద్రజ తన మనోగతాన్ని మొత్తం బయటపెట్టింది. ప్రస్తుతం సమాజం ఎలా ఉంది,.. ? ఇండస్ట్రీ ఎలా ఉంది.. ? ప్రేమ పెళ్లిళ్లు, యువత ఇలా అన్ని విషయాల గురించి మాట్లాడింది.
ఇంద్రజ.. ఈ జనరేషన్ బ్రేకప్స్ గురించి ఎంతో అద్భుతంగా వివరించింది. ఇప్పుడున్న జనరేషన్ లో టక్కున బ్రేకప్ చెప్పి వెళ్లిపోతున్నారు.. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా.. దానిపై మీ అభిప్రాయం ఏంటి.. ? అన్న ప్రశ్నకు ఆమె మాట్లాడుతూ.. 'నేచురల్ బర్త్ ఇచ్చినప్పుడు ఆ పెయిన్ అనేది హయ్యెస్ట్ లెవెల్ లో ఉంటుంది అంటారు కదా.. అంతకు సమానంగా ఉండే పెయిన్ ఏదైనా ఉంది అంటే అది ఇలా ప్రేమలో మోసపోవడమే. అది చేసింది ఆడదైనా సరే.. మగవాడైనా సరే.. వాళ్ళకింక పుట్టగతులు ఉండవు. సర్వనాశనం అయిపోతారు. ఎవరైనా సరే పుట్టింది ప్రేమించడానికి కాదు.. సాధించడానికి' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.