Jr. NTR: చిరంజీవి, బాలకృష్ణ.. నాటు నాటు పాటకు డ్యాన్స్ చేస్తే చూడాలి
ABN, Publish Date - May 12 , 2025 | 10:03 AM
బాబాయ్ బాలకృష్ణ మంచి డ్యాన్సర్లు అని వారిద్దరు కలిసి ఈ నాటు నాటు పాటకు డ్యాన్స్ చేస్తే అది చరిత్రలో ప్రధానంగా నిలిచిపోతుందని అన్నారు జూ. ఎన్టీఆర్.
బాబాయ్ బాలకృష్ణ (Balakrishna), చిరంజీవి గారు ఇద్దరు కలిసి నాటునాటు (Naatu Naatu) పాటకు డ్యాన్స్ వేస్తే చూడాలని ఉందని ఆ డ్యాన్సు చరిత్రలో నిలిచిపోతుందంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం లండన్‌లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ (Royal Albert Hall) లో RRR లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకుడు కీరవాణి, రాజమౌళి (Rajamouli) లతో పాటు జూ. ఎన్టీఆర్ (NTR), రామ్‌చరణ్ (Ram Charan) ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఈ సందర్భంగా కీరవాణి అక్కడి రాయల్ ఫిల్ హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రా (Royal Philharmonic Orchestra) తో కలిసి ఓ అద్భుత ప్రదర్శన ఇచ్చి అక్కడి వారిని తన సంగీతంతో మైమరిపించారు.
ఆనంతరం జరిగిన కార్యక్రమంలో.. జూ. ఎన్టీఆర్ (NTR), రామ్‌చరణ్ (Ram Charan), రాజమౌళి (Rajamouli) RRR సినిమా విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. షూటింగ్ సమయంలో జరిగిర సరదా సంఘటనలు తెలిపారు. అంతేగాక షూటింగ్, పర్సనల్ ఫొటోలను స్క్రీన్‌పై ప్రదర్శించి వాటి వెనుక జరిగిన ఫన్నీ కథలు తెలియజేశారు. ఈసందర్భంగా ఎన్టీఆర్ నాటు నాటు పాట గురించి మాట్లాడుతూ సినిమాలో తన ఆప్త మత్రుడితో కలిసి చేసిన డ్యాన్స్ జీవితంలో మరిచిపోలేనన్నారు. అయితే చిరంజీవి గారు బాబాయ్ బాలకృష్ణ మంచి డ్యాన్సర్లు అని వారిద్దరు కలిసి ఈ నాటు నాటు పాటకు డ్యాన్స్ చేస్తే చూడాలని ఉందని, అది చరిత్రలో ప్రధానంగా నిలిచిపోతుందని అన్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా రాయల్ ఆల్బర్ట్ హాల్ (Royal Albert Hall) అంతా చప్పట్లు, ఆరుపులతో మార్మోగింది. అనంతరం రామ్‌చరణ్ (Ram Charan) ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు అంటూ తారక్ (NTR)కు ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేయగా వారి బాండింగ్‌ను చూసి ఎన్టీఆర్, చరణ్ అభిమానులు సంబుర పడుతున్నారు. అయితే ఇక్కడ అంతా గమనించాల్సిన విషయమేమిటంటే.. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా రూపొందిన ఈ సినిమాను బ్రిటీష్ వారి సొంత దేశం లండన్‌లో వారి ఆడిటోరియంలో అక్కడి ప్రజలతోనే కలిసి చూడడం విశేషం.