Icon Title: ఇండస్ట్రీలో.. ఐకాన్ లొల్లి
ABN , Publish Date - Jul 03 , 2025 | 04:46 PM
పేరులో ఏముంది అనుకుంటాం కానీ సినిమాల విషయంలో మాత్రం పేరులోనే అంతా ఉంటుంది. ఒక సినిమాకు పేరు రావాలంటే... దానికి పెట్టే మకుటమే ముఖ్యం. అందుకేనేమో ఇప్పుడు చిత్ర పరిశ్రమలో టైటిల్స్ విషయం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. రీసెంట్ గా ఓ సినిమా టైటిల్స్ కోసం ఇద్దరు దర్శకులు పోటీపడటం చర్చనీయాంశంగా మారింది.
భారీ బడ్జెట్ తో కూడిన స్టార్ సినిమా అయినా సరే... టైర్ 2 హీరో నటిస్తున్నా సినిమా అయినా సరే.... ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి ముందుగా కావల్సింది సినిమా టైటిల్. అది ఎంత ఆకర్షణీయంగా ఉంటే సినిమాకు అంత ప్లస్ అవుతుంది. కేవలం టైటిల్ ను చూసే... సినిమాలో ఏదో విషయం ఉంది అనుకునేవాళ్లు చాలా మంది ఉంటారు. స్టోరీ గురించి ఒక్క మాటలో చెప్పేందుకు, హీరోకు ఎలివేషన్ ఇచ్చేందుకు కూడా ఈ టైటిలే ప్రధానం. అందుకే మంచి టైటిల్ పెట్టడం మేకర్స్ కు ఎప్పటికీ పెద్ద టాస్క్ గా మారుతుంది. అలాంటి టైటిల్ విషయంలో ఇద్దరు పోటీపడటం సెన్సేషన్ గా మారింది.
సినిమా టైటిల్స్ విషయంలో చాలా మందికి ఎదురయ్యే సమస్య... ఆల్ రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న టైటిల్ ను తమ సినిమాకు పెట్టాలనుకోవడం. తెలిసో, తెలియకో ఒకేసారి ఆ టైటిల్ కోసం పోటీపడటం అప్పుడప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. ప్రెజెంట్ 'ఐకాన్' (Icon) టైటిల్ విషయంలో అదే జరుగుతోంది. అల్లు అర్జున్ (Allu Arjun), శ్రీరామ్ వేణు(Sriram Venu) కాంబోలో రావాల్సింది 'ఐకాన్' మూవీ. జస్ట్ పోస్టర్ తోనే టైటిల్ కు హైప్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. కట్ చేస్తే ఈ మూవీ అనివార్య కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడు బన్నీ ప్లేస్ లో మరో హీరోతో దీనిని చేయాలనుకుంటున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు అదే టైటిల్ పై బన్నీ కన్నేసినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
అల్లు అర్జున్, అట్లీ (Atlee) కాంబోలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీకి 'ఐకాన్' టైటిల్ పెట్టాలనుకుంటున్నారట. పాన్ ఇండియా రేంజ్ తగ్గ టైటిల్ అదని, పైగా యూనిక్ గా ఉందని అటు బన్నీ, అటు అట్లీ భావిస్తున్నారట. పైగా బన్నిని ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ముద్దుగా ఐకాన్ స్టార్ అని పిలిచుకుంటున్నారు. దీంతో ఈ టైటిల్ మూవీకి యాప్ట్ గా ఉంటుందని.. త్వరలోనే అధికారికంగా ప్రకటించాలని అనుకుంటున్నారట. కానీ ఈ మూవీ టైటిల్ శ్రీరామ్ వేణు దగ్గర ఉండట. ఎప్పటికైనా ఈ పేరుతోనే సినిమా తీయాలని శ్రీరామ్ వేణు అనుకుంటున్నారట. అంతేకాక ఈ టైటిల్ ను మరొకరికి ఇచ్చేందుకు ఇష్టపడటం లేదన్న టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే... అట్లీతో బన్నీ చేస్తున్న సినిమాకు ఐకాన్ తప్ప మరో టైటిల్ సరిపోకపోతే... దిల్ రాజు(Dil Raju)ను అడిగి టైటిల్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. కానీ ఇప్పటికి వరకు టైటిల్ గురించి వేణు దగ్గర కానీ, దిల్ రాజు దగ్గర గానీ ప్రస్తావన తీసుకురాలేదని తెలుస్తోంది. దీంతో 'ఐకాన్' గా ఏ హీరో ప్రేక్షకుల ముందుకు వస్తాడనేది ఉత్సుకతను కలిగిస్తోంది.
Read Also:Pawan Kalyan: హరిహరవీరమల్లు ట్రైలర్ వచ్చేసింది.
Also Read: UP CM: యోగి బయోపిక్ టీజర్ వచ్చేసింది...