Allu Arjun: అవమానించడంతోనే...

ABN, Publish Date - May 03 , 2025 | 05:16 PM

సిక్స్ ప్యాక్ సీక్రెట్ ను రివీల్ చేశాడు అల్లు అర్జున్ . ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ నే ఛాలెంజ్ గా తీసుకుని సిక్స్ ప్యాక్ చేశానని చెప్పుకొచ్చాడు. దీంతో ఆ హీరోయిన్ ఎవరా అన్న ఆరాలు మొదలయ్యాయి.

అల్లు అర్జున్ (Allu Arjun) టాలీవుడ్ లో ఓ బ్రాండ్, ఓ ట్రెండ్ సెట్టర్. అతను ఇవాళ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగాడు. పుష్ప (Pushpa) సిరీస్ తో పాన్ఇండియా రేంజ్ లో ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. తాజాగా ముంబైలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్ (Waves Summit) లో హల్ చల్ చేశాడు. విశేషం ఏమంటే... ఈవెంట్ లో బన్నీ తన కెరీర్ తో పాటు ఓ హీరోయిన్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.


సినిమాకోసం అల్లు అర్జున్ (Allu Arjun) ఎలాంటి రిస్క్ చేయడానికైనా రెడీగా ఉంటాడు. తాజాగా బన్నీ తన కెరీర్ లో జరిగిన ఎన్నో విషయాలను వేవ్స్ సమ్మిట్ లో పంచుకున్నాడు. అంతేకాక తన ఫిట్ నెస్ జర్నీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఓ హీరోయిన్ కారణంగా తన ఫిట్ నెస్ జర్నీ మొదలైందని అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె కారణంగానే సౌత్ హీరోలలో సిక్స్ ప్యాక్ బాడీతో సంచలనం సృష్టించిన తొలి నటుడిగా బన్నీ పేరు తెచ్చుకున్నాడట. దాదాపు 20 యేళ్ళ క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తన సిక్స్‌ ప్యాక్‌ వెనకున్న మోటివేషన్‌ కి బాలీవుడ్ కి చెందిన ఓ హీరోయిన్ కారణం అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. తనతో ఓ సినిమాలో నటించిన బ్యూటీ... సౌత్ హీరోలకు సిక్స్ ప్యాక్ చేయడం రాదని... కేవలం బాలీవుడ్ హీరోలకే అది సాధ్యమవుతుందని కామెంట్స్ చేసిందని గుర్తు చేసుకున్నాడు. సౌత్ హీరోలు సైతం ఏదైనా చేయగలని నిరూపించాలనుకున్నాడట బన్నీ. పట్టుదలతో టోన్డ్ బాడీని బిల్డ్ చేసి.. సిక్స్ ప్యాక్ ను సంపాదించుకున్నాడట. ఆ హీరోయిన్ ఛాలెంజ్ చేసిన విధంగా 'దేశముదురు' (Desamuduru) సినిమా టైమ్ కు సిక్స్ ప్యాక్ చేసి చూపించాడట. అయితే ఈ హీరోయిన్ పేరును మాత్రం బన్నీ రివీల్ చేయలేదు. దాంతో ఆమె ఎవరై ఉంటారా అని ఫ్యాన్స్ ఆరా తీయడం మొదలు పెట్టారు. 'దేశముదురు' కంటే ముందు బన్నీ సరసన బాలీవుడ్ హీరోయిన్స్ గా నటించి వారు నిజానికి సౌత్ హీరోలను కామెంట్ చేసేంత రేంజ్ ఉన్నవాళ్ళు కాదు. 'హ్యాపీ'లో నటించిన జెనీలియాను మినహాయిస్తే... మిగిలిన వారంత దాదాపుగా కొత్తవారే. సో... బన్నీని అంతగా హర్ట్ చేసిన హీరోయిన్ ఎవరై ఉంటారు!?

Updated Date - May 03 , 2025 | 05:18 PM