Allu Arjun: అల్లు అర్జున్.. మొద‌లేట్టేశాడుగా! ఇక ర‌చ్చ ర‌చ్చే

ABN, Publish Date - May 03 , 2025 | 09:59 PM

పుష్ప ది రూల్ వంటి బ్లాక‌బ‌స్ట‌ర్ త‌ర్వాత అల్లు అర్జున్ త‌మిళ స్టార్ ద‌ర్శ‌కుడు అట్లీతో క‌లిసి ఓ పాన్ వ‌ర‌ల్డ్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

arjun

పుష్ప ది రూల్ వంటి బ్లాక‌బ‌స్ట‌ర్ త‌ర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) త‌మిళ స్టార్ ద‌ర్శ‌కుడు అట్లీ (Atlee) తో క‌లిసి ఓ పాన్ వ‌ర‌ల్డ్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి విడుద‌ల చేసిన గ్లిమ్స్ వీడియో పెను సంచ‌ల‌నం సృష్టించింది. అభిమానుల్లో విప‌రీత‌మై అంచ‌నాల‌ను పెంచేసింది. ఈ సినిమా విష‌యంలో ఏ చిన్న అప్డేట్ వ‌చ్చినా సోష‌ల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్‌లో ఓ పైపు రాజ‌మౌళి, మ‌హేశ్ బాబు సినిమా విష‌యంలో ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఉత్సుక‌త‌తో ఉన్నారో అదే స్థాయిలో ఈ మూవీకి సంబంధించిన వార్త‌ల విష‌యంలోనూ ఉంది.

తాజాగా సినిమా పాత్ర నిమిత్తం బాడీని పెంచాల్సి రావ‌డంతో అల్లు అర్జున్ త‌న ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. ఓ ప్ర‌ముఖ ఫిట్నెస్ ట్రైన‌ర్ స‌మ‌క్షంలో ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుంటున్నాడు. ఇందుకు సంబంధించి అల్లు అర్జున్ త‌న ట్విట్ట‌ర్ ఎక్స్ అకౌంట్‌లో శిక్ష‌ణ తీసుకుంటున్న ఫొటోను పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఫొటో సోష‌ల్‌ మీడియాను షేక్ చేస్తుండ‌గా ట్విట్ట‌ర్‌లో అల్లు అర్జున్ పేరు ట్రెండింగ్ అవుతోంది. దానిని చూసిన ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో పండుగ చేసుకుంటున్నారు. మావాడు మొద‌లేట్టేశాడు ఇక ర‌చ్చ ర‌చ్చే అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా జూలైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

Updated Date - May 03 , 2025 | 10:07 PM