iBomma Vs Police: మీ యాక్షన్‌కి నా రియాక్షన్ ఉంటుంది.. పోలీసులకు మళ్లీ ఐ బోమ్మ సవాల్
ABN , Publish Date - Oct 01 , 2025 | 09:26 AM
ఇటీవల తెలంగాణ పోలీసులు పైరసీ రాకెట్లను అరెస్టు చేసి, iBomma నిర్వాహకుడిని కూడా పట్టుకుంటామని ప్రకటించారు. కానీ iBomma కౌంటర్ ఛాలెంజ్ ఇచ్చి సంచలనం సృష్టించింది.
తెలుగు సినిమా నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పైరసీ వెబ్‌సైట్ iBomma మళ్లీ వార్తల్లో నిలిచింది. కొత్తగా విడుదలైన సినిమా థియేటర్‌లో అడుగుపెట్టగానే క్షణాల్లో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కావడం, కొన్ని సందర్భాల్లో అయితే ఇంకా విడుదల కాని సినిమాలు కూడా లీక్ కావడం పరిశ్రమను కుదిపేస్తోంది.
సినిమాలు లీక్ కాకుండా ఉండాలంటే నిర్మాతలు తాము అడిగినంత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, రిలీజ్‌కి ముందే బ్లాక్‌మెయిల్ చేసే సందర్భాలు కూడా చోటుచేసుకున్నాయని సమాచారం. ముఖ్యంగా దక్షిణాది చిత్రాలు iBomma లక్ష్యంగా మారడం గమనార్హం. ఇటీవల మూడు రోజుల క్రితం, తెలంగాణ పోలీసులు పెద్ద ఎత్తున పైరసీ రాకెట్లను పట్టుకున్నారు. త్వరలోనే iBomma నిర్వాహకుడినీ అరెస్టు చేస్తామని స్పష్టంగా ప్రకటించారు.
అయితే అదే సమయంలో iBomma కౌంటర్ ఛాలెంజ్ చేస్తూ, పోలీసులను సూటి గా ప్రశ్నిస్తూ తాజాగా ఓ నోట్ రిలీజ్ చేయడం సంచలనంగా మారింది. ఆ పోస్టులో ఏముందంటే.. 'ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మిన తరువాత మీరు ఎం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ OTT రెవిన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు.
1) హీరో లకు అంత రెమ్యూనిరేషన్ అవసరమా? అది మీ కొడుకు అయినా ఎవరు అయినా....
2) సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది వున్నారు, వాళ్ళు ఎం అయిపోతారు అని కబుర్లు చెప్పకండి.. వాళ్ళకి మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసిన వస్తాయి కానీ మీ హీరోకి హీరోయిన్ కి వస్తాయా.
3) సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యూరు రేషన్స్ మరియు విదేశాలలో షూటింగ్ లకు మరియు ట్రిప్స్ కి ఖర్చుపెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చుపెడుతున్నారు? ఇండియా లో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది. కదా? అక్కడ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది కదా.
4) అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికావరీకి దానిని మా మీద రుద్ది ఎక్కువకి అమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసుకోవటానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు.. చివరికి మధ్యతరగతి వాడే బాధ పడుతున్నాడు.
మా వెబ్సైటు మీద ఫోకస్ చేయటం ఆపండి లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్ల మీద మీ ద్రుష్టి పెట్టండి. ఇబొమ్మ అన్నది సిగరేట్ నుంచి e -సిగిరెట్ కు యూజర్స్ ని మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్ కి నా రియాక్షన్ ఉంటుంది. ఈ మిడిల్ లో వేరే ఏ హీరో కూడా (example: Vijay) టార్గెట్ అవ్వటం ఇష్టం లేదు. మేము స్వతహాగా వెబ్సైటు నుంచి తొలిగిస్తున్నాం, ఇప్పుడు ఇమ్మీడియేట్ డిలీట్ చేస్తే మీకు బయపడి లేదా మీరు తీయించినట్టు వుంటది అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తరువాత తీసివేయాలని అనుకుంటున్నాం.
ఇబొమ్మ వాళ్ళు ఇండియాలో తీసివేసిన తరువాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరము, దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయటం లేదు. మేము ibomma.net వళ్ళంత అంత మంచివాల్లం కాదు. బురదలో రాయి వేయకండి... అది కూడా పెంట మీద అసలు వేయకండి.. మేము ఏ దేశం లో వున్నా భారత దేశం, అందులో తెలుగు వానికోసం ఆలోచిస్తాము. (చావుకు భయపడని వాడు దేనికి భయపడడు- There's nothing more dangerous than a man who has nothing to loose)భ అంటూ ఐ బొమ్మ టీం తమ పోస్టులో వ్రాసుకొచ్చారు.
దీనిని అంతా చూస్తుంటే .. ఎంతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ఉపయోగించి తెలంగాణ పోలీస్ సైబర్ నేరస్థుల ఆట కట్టించి పేరు గడిస్తూ ది బెస్ట్ పోలీస్ అని పేరు తెచ్చుకుంటుంటే .. ఇప్పుడు ఐ బొమ్మ వాళ్లనే ఎదురిస్తూ కొత్త సవాల్లను విసురుతుంది. మరి వీళ్ల ఆటను పోలీసులు ఎలా కట్టిస్తారో ఎదురు చూడాలి.