Dhanuh: నాగార్జున గారితో కలిసి నటించడం గర్వంగా ఉంది.. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం
ABN , Publish Date - May 28 , 2025 | 06:05 AM
ధనుష్, నాగార్జున కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం కుబేరా. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మరో 20 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.
ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం కుబేరా (Kuberaa). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మరో 20 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇటీవల విడుదల చేసిన టీజర్ ఊహించిన దాని కన్నా రెట్టింపు ఆదరణను దక్కించుకుంది. దీంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) మొదటి సారి తన స్టైల్‌ను మార్చి తెరకెక్కిస్తుండగా దేవీశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందించాడు. రష్మిక మందన్నా (Rashmika), బాలీవుడ్ నటులు జిమ్ షర్బ్ (Jim Sarbh), దలిప్ తహిల్ (Dalip Tahil) కీలక పాత్రల్లో నటించారు. శ్రీవేంకటేశ్వర సినిమాస్ (Sree Venkateswara Cinemas LLP), అమిగోస్ (Amigos Creations Pvt Ltd ) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
అయితే.. ఇటీవల తమిళనాడులో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ధనుష్ (Dhanush) మాట్లాడుతూ.. నాగార్జున (Nagarjuna)పై తనకున్న అభిమానాన్ని తెలియజేశాడు. నాగార్జున గారితో కలిసి నటించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, నాగర్జున గారు నటించిన సినిమాల్లో నాకు రక్షకుడు బాగా ఇష్టమని, ఆయన సినిమాలకు చిన్నప్పటి నుంచి అభిమానినే అన్నారు. ఇక ఆయనతో పాటు కలిసి నటించడం నాకు ఎంతో గర్వ కారణమని, సెట్‌లో ఉండి ఆయననను చూస్తూ ఎన్నో విషయాలను నేర్చుకున్నానని తెలిపారు. షూటింగ్ సమయంలో ఆయన నుంచి నేర్చుకున్న పాఠాలు నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండి పోతాయన్నారు. ఆయన నుంచి నేర్చుకున్న వాటిని నా కెరీర్‌లో అనుసరించేందుకు ప్రయత్నిస్తాను అని అన్నారు. మా ఇద్దరి కాంబినేషన్‌పై తెలుగు, తమిళ నాట అంచనాలు భారీగా ఉన్నాయని, వాటినన్నింటినీ ఈ చిత్రం తప్పక అందుకుంటుందని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందన్నారు.