Champion: అబ్బబ్బా.. శ్రీకాంత్ కొడుకు డ్యాన్స్ అదరగొట్టేశాడు..
ABN , Publish Date - Dec 21 , 2025 | 08:37 PM
సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేక (Roshan Meka) హీరోగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఛాంపియన్ (Champion).
Champion: సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేక (Roshan Meka) హీరోగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఛాంపియన్ (Champion). జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి స్వప్న సినిమాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అనస్వర రాజన్ (Anaswara Rajan)హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఇంకా సినిమాలోని కొన్ని లిరికల్ సాంగ్స్ ని రిలీజ్ చేస్తున్నారు.
తాజాగా ఐ యామ్ ఆ ఛాంపియన్ అంటూ సాగే సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా 1948లో జరిగే కథ కావడంతో అప్పట్లో ఉన్న డ్యాన్స్ నే చూపించారు. రాక్ అండ్ రోల్ అంటూ రోషన్ తన డ్యాన్స్ తో అదరగొట్టేశాడు. ఇక బ్రహ్మోత్సవం సినిమాలో బాలనటిగా మెప్పించి.. హాలీవుడ్ లో హీరోయిన్ గా మెరిసిన తెలుగమ్మాయి అవంతిక.. ఈ సాంగ్ లో రోషన్ తో కలిసి స్టెప్స్ వేసింది.
ఇప్పటి డ్యాన్స్ ఎవరైనా చేయగలుగుతారు. కానీ, అప్పట్లో డ్యాన్స్ ని అంత గ్రేస్ గా ఆడిపాడడం అన్నది అందరికీ సాధ్యం కాదు. రోషన్, అవంతిక దానిని అలవోకగా చేసిపడేశారు. కెకె అందించిన లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సాంగ్ గురించి చెప్పాలంటే మ్యూజిక్.. దానికి తగ్గట్లు స్టెప్స్ కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్ హైలైట్ గా నిలిచాయి. మిక్కీ జే మేయర్.. చాలా ఫ్రెష్ గా మ్యూజిక్ ని అందించాడు. ఇక ప్రకాష్ రాజ్ భార్య పోనీ వర్మ.. ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేయడం విశేషం. రోషన్ లో ఆ గ్రేస్.. ఎనర్జీ నెక్స్ట్ లెవెల్. ఇక ఆ లుక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సాంగ్ లో చెప్పినట్లుగానే రోషన్ నడిచొస్తే అమ్మాయిలు అలా పడిపోవాల్సిందే. మొత్తానికి ఈ సినిమాలో వచ్చిన మూడు సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. మరి ఈ సినిమాతో టాలీవుడ్ హృతిక్ రోషన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.