Hyper Aadi: అక్రమ సంబంధాలకు.. కులంతో పని లేదు

ABN , Publish Date - Dec 15 , 2025 | 05:48 PM

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కంటెస్టెంట్ గా జబర్దస్త్ కి వచ్చి టీమ్ లీడర్ గా ఎదిగి.. ప్రస్తుతం సినిమాల్లో కమెడియన్ గా, డైలాగ్ రైటర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

Hyper Aadi

Hyper Aadi: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కంటెస్టెంట్ గా జబర్దస్త్ కి వచ్చి టీమ్ లీడర్ గా ఎదిగి.. ప్రస్తుతం సినిమాల్లో కమెడియన్ గా, డైలాగ్ రైటర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న హైపర్ ఆది తాజాగా ఒక యూట్యూబ్ కి ఇచ్చిన పాడ్ కాస్ట్ లో ఎన్నో విషయాల గురించి మాట్లాడాడు. ముఖ్యంగా కులం గురించి, పరువు హత్యల గురించి మాట్లాడాడు.

క్యాస్ట్ ఫీలింగ్ గురించి ఆది మాట్లాడుతూ.. ' నేను క్యాస్ట్ ఫీలింగ్ ను నేను నమ్మను. కాలేజ్ టైమ్ నుంచి కూడా నాకు అవి నచ్చలేదు. అలాంటివి వేస్ట్ అని ఫీలింగ్. వాటివలన ఏవి రావు. నువ్వు క్యాస్ట్.. క్యాస్ట్ అంటావా.. నీకు సమస్య వచ్చినప్పుడు నీ కులం వాడే రాడు. క్యాస్ట్ తో ఏం సంబంధం. డాక్టర్ దగ్గరకు వెళ్తావ్.. డాక్టర్ మీదే క్యాస్ట్ అని ఇంజక్షన్ చేయించుకుంటావా.. ? అవసరం కాబట్టి చేయించుకుంటావ్. చచ్చిపోతుంటే ఒకడు వచ్చి నీళ్లు ఇస్తే వాడు ఏ క్యాస్ట్ అని చూస్తావా.. అవసరం ఉంది కాబట్టి నీకు వారి కులంతో అవసరం లేదు. అవసరాన్ని బట్టి కులాన్ని వాడుకోవడం తప్పు.

ఈమధ్య కాలంలో పరువు హత్యలు బాగా జరుగుతున్నాయి. వేరే కులం అమ్మాయిని ప్రేమించాడని అబ్బాయిలను చంపేస్తున్నారు. వాటిపై మీ అభిప్రాయం ఏంటి అని యాంకర్ అడగ్గా.. ఆది మాట్లాడుతూ.. 'ఈరోజుల్లో ఎవరికైనా సరే సంబంధాలకేమో వారి కులం వాళ్లు కావాలి. అక్రమ సంబంధాలకు మాత్రం ఏ కులం అయినా పర్లేదు. బయట చాలా చూస్తున్నారు కదా.. అక్రమ సంబంధాలకు కులం అవసరం లేదు.. దానికి ఎవరైనా ఓకే. కానీ, సంబంధాలకు మాత్రం మావాళ్లే అని అంటారు. ఎందుకు వాళ్లు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటే పెళ్లి చేయాలి. వాళ్ళు జీవితాంతం బావుంటారు అనుకుంటే.. అవతలివాడికి పోషించే శక్తి ఉంటే పెళ్లి చేయాలి. లేదు అంటే.. బాబు నీకు పోషించే శక్తి లేదు. అది వచ్చేవరకు మా అమ్మాయిని ఇవ్వము.. జాబ్ తెచ్చుకో అప్పుడు పెళ్లి చేస్తాం అని చెప్పాలి కానీ ఇద్దరినీ చంపుకుంటే ఏం వస్తుంది. ఒక నిమిషం ఆలోచించేదానికి చంపుకోవడం ఎందుకు.. ? అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Updated Date - Dec 15 , 2025 | 05:49 PM