Raghuram Alias Dhruvan: ‘హంగ్రీ చీటా’తో ఎక్కడికో వెళ్ళిపోయాడు.. 

ABN , Publish Date - Sep 28 , 2025 | 10:46 AM

ఇప్పుడంతా ఓజీ’ మానిమానే నడుస్తోంది. ‘ఓజి’ (OG) చిత్రంతో ‘హంగ్రీ చీటా’ (Hungry Cheetah) ఎంతగా పాపురల్‌ అయిందో తెలిసిందే. ఈ పాట రాసిన గేయ రచయిత, సంగీత దర్శకుడు, సింగర్ గురించి ఈ విషయాలు తెలుసా

Dhruvan

ఇప్పుడంతా ఓజీ’ మానిమానే నడుస్తోంది. ‘ఓజి’ (OG) చిత్రంతో ‘హంగ్రీ చీటా’ (Hungry Cheetah) ఎంతగా పాపురల్‌ అయిందో తెలిసిందే. ఆ పాట ప్రొమో రిలీజ్‌ అయినప్పటి నుంచి యూట్యూబ్‌ను, సోషల్‌ మీడియాను ఇలా మాధ్యమం ఏదైనా సంగీత ప్రియుల్ని ఊపేసింది. ఎక్కడ చూసినా, విన్నా ఈ పాటే! దాంతోపాటు ఈ పాట, దానికి థీమ్స్‌, బీజీఎమ్‌ డాల్బీ అట్మాస్‌ బాక్స్‌లను సైతం బద్దలుకొట్టేస్తోంది. చిన్న పిల్లల నుంచి 60 ప్లస్‌ వరకూ ‘ఓజి’ పేరు తెగ కలవరిస్తున్నారు. హంగ్రీ చీటా పాటను పాడేసుకుంటున్నారు. ఈ సినిమాకు పవన్‌ కల్యాణ్‌ బ్రాండ్‌ ఉన్నప్పటికీ ఓయ రేంజ్‌ హైప్‌ తీసుకొచ్చింది మాత్రం ‘హంగ్రీ చీటా’ గ్లింప్స్‌ అనే చెప్పాలి. ‘నెత్తురుకు మరిగిన హంగ్రీ చీటా.. శత్రువును ఎంచితే మొదలు వేట..చూపు గాని విసిరితే ఓర కంట..డెత్‌ కోటా కన్ఫర్మ్‌ అంట..’ అంటూ ఆ గ్లిం్‌ప్స్‌లో వచ్చే లిరిక్స్‌ అభిమానులకు గూజ్‌ బంప్స్‌ తెప్పించాయి. సినిమాకి ప్రమోషన్స్‌ అవసరం లేనంత రేంజ్లో పబ్లిసిటీ తీసుకొచ్చాయి. (Raghuram Alias Dhruvan)

Dhruvan3.jpg

అయితే ఈ పాట వెనక ఓ కథ ఉంది. ఈ పాటకు లిరిక్స్‌ అందించింది యువ సంగీత దర్శకుడు ఆర్‌ఆర్‌ ధృవన్‌ (Dhruvan - రఘురామ్‌ ఒకప్పటి పేరు). అయితే ఈయన పేరు ఇండస్ట్రీ జనాలకు తప్ప బయట వారికి పెద్దగా తెలీదు. అవును ‘హంగ్రీ చీటా’ పాట రాసింది ఆయనే.. పాడిన సింగర్స్‌లో ఆయన కూడా ఒకరు. అయితే ఈ సాంగ్‌ క్రెడిట్స్‌లో ధృవన్‌ పేరుకు బదులు రాఘురామ్‌ అని ఉంటుంది. సింగర్‌గా కెరీర్‌ ప్రారంభించినప్పుడు ధృవన్‌ పేరు రఘురామ్‌గా రిజిస్టర్‌ అయింది. అయితే అతని పూర్తి పేరు రఘురామ్‌ ధృవన్‌. ఈ విషయం బయటకు పెద్దగా తెలీదు. రఘురామ్‌గానే ఆయనకు తెలుసు. సింగర్‌గా బిజీగా ఉంటూనే సంగీత దర్శకుడిగా కూడా ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు.

Dhruvan.jpg

సాయి దుర్గ తేజ్‌ హీరోగా తెరకెక్కిన ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ సినిమాలో ‘నో పెళ్లి’ ‘హే ఇది నేనేనా’ వంటి పాటలకు సాహిత్యం అందించారు ధృవన్‌. ఆ రెండు పాటలు సూపర్‌హిట్టే. అటు తర్వాత ప్రభాస్‌ ‘రాధే శ్యామ్‌’ సినిమాలో ‘రాధే రాధే’ క్లైమాక్స్‌లో  వచ్చే పాటకు సాహిత్యం అందించింది ఈయనే. రామ్‌ పోతినేని ‘స్కంద’ సినిమాలో ‘నీ చుట్టు చుట్టు’, ‘మ్యాడ్‌’ లో ‘ప్రౌడ్‌ సే సింగిల్‌’, ‘లియో’లో ‘నే రెడీ’, ‘ఓజి’ లో హంగ్రి చీటా, ‘గని’ లో ‘రోమియోకి జూలియెట్టు’ వంటి సాంగ్స్‌ అన్నీ కూడా చార్ట్‌ బస్టర్స్‌ అయ్యాయి.

Dhruvan-2.jpg

అంతకు ముందు  'ఉషా పరిణయం' 'లంబసింగి'  వంటి ఎన్నో క్రేజీ సినిమాలకు సంగీతం అందించారు ధృవన్. 'మైల్స్ ఆఫ్ లవ్' లో 'తెలియదే' , బాపులో 'కంగారు పడకు' వంటి సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అవ్వడమే కాకుండా బాగా వైరల్ అయ్యాయి. తాజాగా అయన సంగీతం అందించిన 'మిత్రమండలి' సినిమాలో 'జంబర్ గింబర్ లాలా' సాంగ్ కూడా తెగ ట్రెండ్ అవుతుంది. ఇక 'బొంబాయ్ పోతావా', 'డియో డియో' వంటి పాటలతో సింగర్ గా కూడా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ పాటలు కూడా చార్ట్ బస్టర్స్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'ఓజి' తో ధృవన్ పేరు మార్మోగుతుంది. ఈ సినిమాలో దాదాపు 8 సార్లు పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ కోసం 'హంగ్రీ చీటా' సాంగ్ ని వాడారు. 'ఓ దశాబ్ద కాలం పాటు సెలబ్రేట్ చేసుకునే సాంగ్ ను ఇచ్చారు' అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం 'హంగ్రీ చీటా' లిరిసిస్ట్ అయిన ధృవన్ ని ప్రశంసిస్తున్నారు.

Updated Date - Sep 28 , 2025 | 10:48 AM