RRR: మరోసారి.. మారు మ్రోగిన RRR! లండన్‌లో రచ్చ రచ్చ
ABN, Publish Date - May 12 , 2025 | 07:09 AM
RRR పేరు మరోసారి అంతర్జాతీయంగా మారు మ్రోగింది. తాజాగా ఆదివారం రాత్రి ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో RRR లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు.
RRR పేరు మరోసారి అంతర్జాతీయంగా మారు మ్రోగింది. తాజాగా ఆదివారం రాత్రి ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ (Royal Albert Hall) లో RRR లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకథీరుడు రాజమౌళి (Rajamouli) లతో పాటు జూనియర్ ఎన్టీఆర్ (NTR), రామ్‌చరణ్ (Ram Charan) హజరయ్యారు. ఈ సందర్భంగా కీరవాణి అక్కడి రాయల్ ఫిల్ హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రా (Royal Philharmonic Orchestra) తో కలిసి ఓ అద్భుత ప్రదర్శన ఇచ్చి ఆహుతులను మెస్మరైజ్ చేశారు. అయితే ఈ ప్రోగ్రాంకు ప్రిన్స్ మహేశ్ బాబు కూడా అటెండ్ కాబోతున్నట్లు ముందు నుంచి ప్రచారం జరగడం తీరా మహేశ్ రాక పోవడంతో అక్కడికి వచ్చిన మహేశ్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.
ఇదిలాఉండగా.. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే రామ్‌చరణ్ (Ram Charan) ముందస్తుగా తారక్ (NTR)కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆలింగనం చేసుకున్నారు. ఈ దృశ్యం అక్కడికి వచ్చిన వారిని కట్టి పడేయడమే గాక వారిరువురి మధ్య బాండింగ్‌ను మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. అంతేకాదు ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలను ప్రత్యేకంగా ప్రదర్శించి అక్కడికి వచ్చిన వారిలో ఉత్సాహం నింపారు. వీటిని చూసిన ఫ్యాన్స్ అంతా ఈలలు, చప్పట్లతో ఆడిటోరియం దద్దరిల్లేలా చేశారు. ఇందుకు సంబంధించిన పొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.