Hrithik Roshan: యుద్ధంలో ప్రణయం

ABN , Publish Date - Jul 30 , 2025 | 03:48 AM

జూనియర్‌ ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ ప్రధానపాత్రల్లో అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వార్‌ 2’. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను...

జూనియర్‌ ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ ప్రధానపాత్రల్లో అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వార్‌ 2’. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా, ఫస్ట్‌ సింగిల్‌ గురించి అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. ‘ఆవన్‌ జావన్‌’ అంటూ సాగే ఈ పాటను ఈ వారంలోనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇది ‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ (కుంకుమలా నువ్వే) పాట కంటే మరింత ఆకట్టుకుంటుందని చెప్పారు. హృతిక్‌ రోషన్‌, కియార అడ్వానీపై చిత్రీకరించిన ఈ రొమాంటిక్‌ సాంగ్‌ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అన్నారు. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Updated Date - Jul 30 , 2025 | 03:48 AM