Nuvvu Naaku Nachav,: నందు పాత్రకు ఆర్తి ఆగర్వాల్‌ ఎలా సెట్‌ అయిందో తెలుసా

ABN , Publish Date - Dec 18 , 2025 | 09:18 PM

‘నువ్వు నాకు నచ్చావ్‌’చిత్రం హీరోయిన్‌ కోసం పెద్ద కసరత్తే జరిగింది. ఓ పట్టాన హీరోయిన్‌ సెట్‌ కాలేదట. దర్శకనిర్మాత ముందు త్రిష, భూమిక, మాళవిక ఇలా చాలా ఆప్షన్లు ఉన్నాయి. కానీ ఫ్రెష్ ఫేస్‌ అయితే బావుంటుందనుకున్నారు

వెంకటేశ్‌ (Venkatesh) కెరీర్‌ భారీ విజయం సాధించిన చిత్రాల్లో ‘నువ్వు నాకు నచ్చావ్‌’ (Nuvvu Naaku Nachav,) ఒకటి. కుటుంబ ప్రేక్షకులతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ చిత్రం అలరించింది. త్రివిక్రమ్‌ రచన, విజయ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో స్రవంతి రవి కిశోర్‌ నిర్మించిన ఈ చిత్రం హీరోయిన్‌ కోసం పెద్ద కసరత్తే జరిగింది. ఓ పట్టాన హీరోయిన్‌ సెట్‌ కాలేదట. దర్శకనిర్మాత ముందు త్రిష, భూమిక, మాళవిక ఇలా చాలా ఆప్షన్లు ఉన్నాయి. కానీ ఫ్రెష్ ఫేస్‌ అయితే బావుంటుందనుకున్నారు దర్శకనిర్మాతలు. వెంటనే ముంబయ్‌ వెళ్లి మోడల్‌ కో–ఆర్డినేటర్స్‌ దగ్గర చాలామంది అమ్మాయిల స్టిల్స్‌ చూశారు. వాళ్లల్లో ఒకమ్మాయి తెగ నచ్చేసింది. అప్పటికే బాలీవుడ్‌లో ‘పాగల్‌పన్‌’ సినిమాలో హీరోయిన్‌గా కూడా చేసింది. ఆమే ఆర్తి అగర్వాల్‌ (Aarti Agarwal)

వివరాలు తెలుసుకుంటే న్యూయార్క్‌లో ఉందని తెలిసింది. కానీ కాంటాక్ట్‌ లేదు.
మామూలుగా అయితే ఆ అమ్మాయిని అక్కడే వదిలేసేవారు. అయితే, ఆ పాత్ర ఆమెకే రాసిపెట్టినట్టుంది. అందుకే న్యూయార్క్‌లో ఆమె గురించి వేట మొదలుపెట్టారు. చివరకు దొరికేసింది. సినిమాలో నందిని పాత్రకు ఆర్తి ఖరారు అయింది. షూటింగ్‌ స్టార్స్‌ చేసి హిట్‌ కొట్టారు. ఇందులో ఆర్తి అగర్వాల్‌ నందు పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. ఆమె కెరీర్‌లో ఇదొక క్యారెక్టర్‌గా ఆమె చెబుతుండేవారు. ఈ విషయాలన్నింటినీ మేకర్స్‌ మేకింగ్‌ మెమరీస్‌ అంటూ ఓ పోస్టర్‌ విడుదల చేసి తెలిపారు. 2001 విడుదలై సూపర్‌హిట్‌ సాధించిన ఈ చిత్రం 25 ఏళ్ల తర్వాత ఈ చిత్రం మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈచిత్రాన్ని డిజిటలైజ్‌ చేని 4కె వెర్షన్‌లో జనవరి ఒకటో తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

Updated Date - Dec 18 , 2025 | 09:37 PM