Hrithik in War 2 : ఎన్టీఆర్‌తో కలసి పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తున్నా
ABN , Publish Date - Jul 09 , 2025 | 06:24 AM
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’. 2019లో విడుదలై ఘనవిజయం సాధించిన ‘వార్’కు ఇది సీక్వెల్. తాజాగా, ఈ సినిమా షూట్...
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’. 2019లో విడుదలై ఘనవిజయం సాధించిన ‘వార్’కు ఇది సీక్వెల్. తాజాగా, ఈ సినిమా షూట్ పూర్తి కావడంతో టీమ్ అంతా సెలబ్రేట్ చేసుకుంది. ఈ విషయాన్ని అభిమానులతో ఎక్స్ వేదికగా పంచుకున్నారు ఎన్టీఆర్. ‘‘ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చిన ‘వార్ 2’ చిత్రీకరణ పూర్తైంది. హృతిక్ రోషన్‌తో పనిచేయడం ఎంతో సరదాను ఇచ్చింది. అపారమైన ఆయన ఎనర్జీ లెవెల్స్ అంటే నాకెంతో అభిమానం. ఆయన నుంచి చాలా నేర్చుకున్నా. దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేయడానికి సిద్ధమయ్యారు’’ అని పేర్కొన్నారు. మరోవైపు, హృతిక్ కూడా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టి భావోద్వేగానికి గురయ్యారు. ‘‘మనసంతా భావోద్వేగాలతో నిండిపోయింది. 149 రోజుల షూట్‌లో చేసిన అద్భుతమైన యాక్షన్, వేసిన డ్యాన్సులు, అయ్యిన గాయాలు.. అన్నీ మరపురానివి. ఎన్టీఆర్‌తో కలసి పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తున్నా’’ అని అన్నారు. ఆగస్టు 14న సినిమా విడుదల కానుంది. కియారా అడ్వాణీ కథానాయిక. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.