Mahesh Babu: రాజమౌళి కాదు కదా.. ఎవరూ ఆపలేరు..
ABN , Publish Date - May 02 , 2025 | 02:25 PM
సినిమా షూటింగ్‌లో కాస్త గ్యాప్ దొరికితే చాలు సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కుటుంబానికి టైమ్ కేటాయిస్తారు. లేదా విదేశాలకు టూర్‌కి చెక్కేస్తుంటారు.
సినిమా షూటింగ్‌లో కాస్త గ్యాప్ దొరికితే చాలు సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కుటుంబానికి టైమ్ కేటాయిస్తారు. లేదా విదేశాలకు టూర్‌కి చెక్కేస్తుంటారు. ఏడాదికి ఫ్యామిలీతో మినిమం మూడు ట్రిప్‌లు వేస్తుంటారు. ఇక సమ్మర్ అయితే ఎక్కువ శాతం విదేశాల్లో ఉండటానికే ట్రై చేస్తుంటారు. అయితే మహేశ్ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నారు. రాజమౌళితో (SS rajamouli) సినిమా అంటూ షరతులు వర్తిస్తాయి. ఆయన స్కూల్ సిలబస్ స్ట్రిక్ట్‌గా ఉంటుంది. షూటింగ్ టైమ్‌లో గ్యాప్ ఇవ్వరు. నో లీవ్స్. ఆయన రూల్స్‌కి మహేశ్ బాబు లాక్ అయిపోయారు అనుకున్నారు అభిమానులు. పైగా జక్కన్న మహేశ్ పాస్‌పోర్ట్ కూడా తీసేసుకున్నారు. దాంతో మహేశ్‌కి సెలవులు ఉండవు, ఇక మహేశ్‌కి విదేశాల ట్రిప్ కష్టమే అనుకున్నారంతా. కానీ మహేశ్ ప్రణాళికలో ఎలాంటి మార్పు లేదు. రాజమౌళి సినిమా అయితేనేం.. బ్రేక్.. బ్రేకే, ట్రిప్పులు షరా మామూలే.
ప్రస్తుతం హైదరాబాద్ శివారల్లో ఓ పాట తెరకెక్కిస్తున్నారు. మహేష్, ప్రియాంకా చోప్రా ఈ షూట్‌లో పాలుపంచుకున్నారు. వేసవి కావడంతో ఈ సినిమాకు బ్రేక్ వచ్చింది. తిరిగి జూన్ 10న షూటింగ్ మొదలు కానుందని టీమ్ నుంచి సమాచారం. తదుపరి వారణాసి సెట్లో కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తారు. ఈ సెట్ కి సంబంధించిన పనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ 40 రోజుల్లో మహేష్ ఇంకో ట్రిప్ వేసే ఛాన్స్ ఉంది. ఆయనతోపాటు దర్శకుడు రాజమౌళి కూడా విహార యాత్రకు వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇందులో మలయాళ దర్శకుడు, నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. నానా పటేకర్ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నట్టు వార్తలొచ్చాయి. అయితే చిత్ర బృందం దీనిపై క్లారిటీ ఇవ్వలేదు.