Biker: బైకర్‌గా.. వస్తున్న శర్వానంద్! రెండేండ్ల తర్వాత.. అప్డేట్!
ABN , Publish Date - Oct 20 , 2025 | 12:25 PM
శర్వానంద్ (Sharwanand) – యూవీ క్రియేషన్స్ (UV Creations) కాంబోలో వస్తున్న కొత్త సినిమా బైకర్ (Biker) అధికారికంగా అనౌన్స్ అయింది.
గత సంవత్సరం మనమే సినిమాతో ప్రేక్షకుల ఎదుటకు వచ్చిన హీరో శర్వానంద్ (Sharwanand) తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం యూవీ క్రియేషన్స్ (UV Creations)తో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని విక్రమ్ సమర్పణలో వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. గమనించదగ్గ విషయం ఏంటంటే రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు వంటి బ్లాక్‌బస్టర్లతో శర్వానంద్‌కు యూవీ క్రియేషన్స్ చాలా సెంటిమెంట్‌గా మారింది. కాగా గతంలో లూజర్ వంటి హిట్ వెబ్ సిరీస్, మా నాన్న సూపర్ హీరో సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న అభిలాష్ కంకర (Abhilash Reddy Kankara) తన రెండో ప్రయత్నంగా ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నాడు.
అయితే.. శర్వా 36 సినిమాగా రెండేళ్ల క్రితం ప్రారంభమై పూజా కార్యక్రమాలు కూడా చేసుకున్న ఈ నుంచి ఎట్టకేలకు అప్డేట్ వచ్చింది. తొఅప్పట్లో శర్వానంద్ బర్త్‌డే సందర్భంగా అనౌన్స్ చేసిన పోస్టర్‌లో డస్టీ రోడ్‌పై మోటోరేస్ సీన్ కనిపించింది. మధ్యలో బైక్‌పై ఎగురుతున్న రైడర్ జాకెట్‌పై “S36” లోగోతో హీరో క్యారెక్టర్‌ను సూచించారు. అప్పుడు నుంచే ఇది స్పోర్ట్స్ బేస్డ్ మూవీ అని స్పష్టమైంది. కాగా.. ఇప్పుడు తాజాగా దీపావళి సందర్భంగా ఈ చిత్రానికి బైకర్ (Biker) అని అధికారికంగా టైటిల్ ఫిక్స్ చేశారు.
ఇది మూడు తరాల కుటుంబానికి సంబంధించిన హార్ట్‌టచింగ్ కథగా, 90ల నాటి మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంతో సాగనుంది. లవ్, డ్రీమ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ మిళితంగా ఉండే ఈ కథలో శర్వానంద్ ఒక ప్రొఫెషనల్ బైక్ రైడర్‌గా కనిపించనున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో శర్వానంద్ తొలిసారిగా కనిపించబోతుండటంతో ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ బైకర్ మూవీ శర్వా కెరీర్‌లో మరో మలుపు తీసుకురావచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.
హీరోయిన్‌గా మాళవిక నాయర్ (Malvika Nair) ఎంపిక కాగా, టెక్నికల్ టీమ్ కూడా బలంగా ఉంది. ట్రెండీ మ్యూజిక్‌కి పేరుగాంచిన జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా, జె. యువరాజ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నారు. రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, అనిల్ కుమార్ పి ఎడిటర్‌గా, ఎ. పన్నర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఎన్. సందీప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.