Vaaranaasi: రాముడిగా మహేష్.. హనుమంతుడిగా మాధవన్..

ABN , Publish Date - Nov 19 , 2025 | 07:01 PM

రోజురోజుకూ వారణాసి(Vaaranaasi) సినిమాపై నెగిటివిటీ పెరిగిపోతూ వస్తుంది. రాజమౌళి (Rajamouli).. హనుమంతుడిని అవమానించాడని హిందూ సంఘాలు మండిపడడం, వారణాసి టైటిల్ తమది అని మరొకరు కేసు వేయడం.. ఇలా ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉన్నాయి.

Vaaranaasi

Vaaranaasi: రోజురోజుకూ వారణాసి(Vaaranaasi) సినిమాపై నెగిటివిటీ పెరిగిపోతూ వస్తుంది. రాజమౌళి (Rajamouli).. హనుమంతుడిని అవమానించాడని హిందూ సంఘాలు మండిపడడం, వారణాసి టైటిల్ తమది అని మరొకరు కేసు వేయడం.. ఇలా ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉన్నాయి. అయినా కూడా జక్కన్న వీటిని పట్టించుకోకుండా సినిమాపై ఫోకస్ చేస్తున్నాడు. ఇక ఇంకోపక్క మహేష్ బాబు(Mahesh Babu), ప్రియాంక చోప్రా (Priyanka Chopra), పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంటర్నేషనల్ మీడియాలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

ఇవన్నీ పక్కన పెడితే.. సోషల్ మీడియాలో వారణాసి సినిమా గురించిన ఏ వార్త వచ్చినా వైరల్ చేసి పడేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వారణాసిలో కోలీవుడ్ స్టార్ హీరో ఆర్. మాధవన్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. అయితే మొన్నటివరకు మహేష్ కు తండ్రిగా కీలక పాత్రలో మాధవన్ కనిపిస్తాడు అంటూ వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఆ పాత్ర కాదని, ఆయన హనుమంతుడి పాత్రలో నటిస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో జక్కన్న.. మహేష్ .. రాముడిగా నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశాడు. ఇప్పటికే ఆ ఘాట్ కూడా ఫినిష్ అయ్యిందని, రాముడిగా మహేష్ ఎంతో అద్బుతంగా కనిపించాడు అని చెప్పుకొచ్చాడు. దీంతో సినిమాపై హైప్ ఇంకా పెరిగిపోయింది. మిగతా పాత్రల్లో ఎవరు నటిస్తారు అనుకుంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జక్కన్న ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. అందుకే ప్రతి పాత్రలో టాప్ స్టార్స్ నే తీసుకుంటున్నాడు. గ్లోబల్ ప్రాజెక్ట్ కాబట్టి ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక్కో స్టార్ ను తీసుకుంటున్నాడని టాక్. ఇక హనుమాన్ గా మాధవన్ అయితే బాగా సెట్ అవుతాడని నమ్మి ఆ పాత్ర ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో అభిమానులు మరింత హిప్ పెంచేసుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Nov 19 , 2025 | 07:04 PM