Trinadha Rao Nakkina: ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో హవీష్‌

ABN , Publish Date - Jun 18 , 2025 | 02:39 PM

హవీష్ హీరోగా త్రినాథరావు నక్కిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

యంగ్ టాలెంటెడ్ హీరో హవీష్ (Havish), సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు (Trinadha Rao Nakkina) కాంబోలో క్రేజీ మూవీ ఒకటి రూపుదిద్దుకుంటోంది.

'నువ్విలా (Nuvvila), జీనియస్, రామ్ లీలా, సెవెన్' వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హవీష్‌. అలానే 'సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా (Dhamaka), మజాక (Mazaka)' వంటి చిత్రాల దర్శకుడిగా టాలీవుడ్ లో త్రినాథరావు నక్కిన కూ మంచి పేరుంది. వీరిద్దరి కలయికలో నిఖిల్ కోనేరు సినిమాను నిర్మిస్తోంది.


Working Still.jpgహవీష్‌ మూవీ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటోందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటీవల పూర్తయ్యింది. మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను ఈ నెల 19న రిలీజ్ చేయబోతున్నామని నిర్మాత నిఖిల కోనేరు తెలిపారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తుండగా.. నిజార్ షఫీ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.

Also Read: Tollywood: యంగ్ హీరోస్ పరిస్థితేంటీ...

Also Read: Trisha Krishnan: పరాజయాల్లో డబుల్ హ్యాట్రిక్

Updated Date - Jun 18 , 2025 | 02:39 PM