Dulquer Salmaan: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన.. దుల్కర్ సల్మాన్! ఎందుకంటే

ABN , Publish Date - Jul 20 , 2025 | 01:38 PM

దుల్క‌ర్ స‌ల్మాన్ ఆదివారం ఉద‌యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయ‌న జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

revanth Dulquer Salmaan

ప్ర‌ముఖ మ‌ల‌యాళ‌, తెలుగు న‌టుడు, సీతారామం ఫేం దుల్క‌ర్ స‌ల్మాన్ (DulQuer Salmaan) ఆదివారం ఉద‌యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (RevanthReddy)ని ఆయ‌న జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయ‌న వెంట సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అశ్వినీ ద‌త్ కుమార్తె నిర్మాత స్వప్న దత్ (Swapna Dutt), ద‌స‌రా, ప్యార‌డైజ్ చిత్రాల నిర్మాత సుధాక‌ర్ చెరుకూరి (Cherukuri Sudhakar) ఉన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ దుల్క‌ర్కు శాలువా క‌ప్పి స‌న్మానించారు. అయితే దుల్క‌ర్ సీఎం రేవంత్ రెడ్డిని క‌ల‌వ‌డం వెన‌క ప్ర‌త్యేక కార‌ణాలేవి బ‌య‌ట‌కు తెలియ‌లేదు.

అయితే.. ఇటీవ‌ల తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన గ‌ద్ద‌ర్ అవార్డ్స్ (Gaddar Awards)లో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించిన సీతారామం (Sita Ramam), మ‌హా న‌టి, ల‌క్కీ భాస్క‌ర్ (Lucky Baskhar ) మూడు చిత్రాలు అవార్డులు ద‌క్కించుకోవ‌డంతో పాటు దుల్క‌ర్ స‌ల్మాన్‌(DulQuer Salmaan)కు స్పెష‌ల్ జ్యూరీ అవార్డు ప్ర‌క‌టించ‌డం విశేషం. కాగా అవార్డుల ప్ర‌ధానోత్స‌వ స‌మ‌యంలో దుల్క‌ర్ హ‌జ‌రు కాన‌దున ఇప్పుడు ప్ర‌త్యేకంగా స‌మ‌యం తీసుకుని క‌లిసిన‌ట్లు తెలుస్తోంది.

DulQuer Salmaan

ఇదిలాఉంటే దుల్క‌ర్ స‌ల్మాన్ ప్ర‌స్తుతం తెలుగులో అకాశంతో ఒక తార (Aakasam Lo Oka Tara) , కాంత (Kaantha), మ‌ల‌యాళంలో రెండు చిత్రాలు చేస్తున్నాడు. మ‌రోవైపు దుల్క‌ర్ వైజ‌యంతి మూవీస్ సంస్థాన న‌టుడు కావ‌డం గ‌మ‌నార్హం. ఇప్పటివ‌రకు ఆయ‌న చేసిన మ‌హాన‌టి (Mahanati), సీతారామం (Sita Ramam) చిత్రాల‌తో పాటు క‌ల్కీలోనూ న‌టించ‌డం విశేషం. అంతేగాక అశ్వినీద‌త్ కుటుంబంతో సీఎం రేవంత్ రెడ్డికి ద‌శాబ్దాలుగా పరిచయం ఉండటం విశేషం. ఈ విషయాన్ని గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి స్వ‌యానా గుర్తు చేయ‌డం విశేషం.

Updated Date - Jul 20 , 2025 | 01:38 PM