Romantic Film: అలరించే ప్రేమకథా చిత్రం

ABN , Publish Date - Jul 31 , 2025 | 06:21 AM

హెబ్బా పటేల్‌, ధనుష్‌ రఘుముద్రి జంటగా నటించిన చిత్రం ‘థాంక్యూ డియర్‌’. తోట శ్రీకాంత్‌ కుమార్‌ దర్శకత్వంలో పప్పు బాలాజీ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా...

హెబ్బా పటేల్‌, ధనుష్‌ రఘుముద్రి జంటగా నటించిన చిత్రం ‘థాంక్యూ డియర్‌’. తోట శ్రీకాంత్‌ కుమార్‌ దర్శకత్వంలో పప్పు బాలాజీ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం బుధవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. శ్రీకాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించే సున్నితమైన ప్రేమకథా చిత్రం ఇది. తెరపై అందమైన ప్రణయ భావనల్ని ఆవిష్కరిస్తుంది. సమకాలీన సమాజంలో చర్చనీయాంశంగా మారిన ఓ ముఖ్యమైన పాయింట్‌ను తీసుకొని ఈ సినిమా తెర కెక్కించాం’ అన్నారు. బాలాజీ మాట్లాడుతూ ‘మానవ సంబంధాలను చర్చిస్తూ సందేశాత్మకంగా సాగే చిత్రమిది. ప్రేక్షకులు ఆశించే అంశాలతో అలరిస్తుంది’ అని తెలపారు. ఈ చిత్రంలోని ఎమోషన్స్‌ చాలాకాలం పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయి అని కథానాయిక రేఖా నిరోషా చెప్పారు.

Updated Date - Jul 31 , 2025 | 06:21 AM