Ustaad bhagath singh: చిన్న న్యూస్‌ కాదు.. పెద్ద న్యూస్‌ వస్తుంది.. వెయిట్‌..

ABN , Publish Date - Nov 18 , 2025 | 02:40 PM

పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంలో ఓ సాంగ్‌లో వింటేజ్‌ లుక్‌ను రివీల్‌ చేశారు. మళ్లీ ఇప్పటిదాకా సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. అయితే సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ త్వరలోనే రిలీజ్‌ చేస్తామంటూ ఇటీవల టీమ్‌ చిన్న హింట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే

గబ్బర్‌సింగ్‌ తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (pawan Kalyan) , హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) కాంబోలో వస్తున్న చిత్రం  ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad bhagath singh). కొన్ని సన్నివేశాలు మినహా ఈ చిత్రం షూటింగ్‌ దాదాపుగా పూర్తయింది. మరో పక్క పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా సాంగ్‌లో వింటేజ్‌ లుక్‌ను రివీల్‌ చేశారు. మళ్లీ ఇప్పటిదాకా సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. అయితే సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ త్వరలోనే రిలీజ్‌ చేస్తామంటూ ఇటీవల టీమ్‌ చిన్న హింట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే! తాజాగా దర్శకుడు హరీష్‌ శంకర్‌ అధికారికంగా వెల్లడించారు.  



అల్లరి నరేష్‌ హీరోగా నటించిన ‘12ఎ రైల్వే కాలనీ’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హరీష్‌ శంకర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా అప్‌డేట్‌ గురించి అడగ్గా... ‘చిన్న కరెక్షన్‌... ఉస్తాద్‌ గురించి చిన్న న్యూస్‌ ఉండదు. పెద్ద న్యూస్‌ ఉంటుంది. డిసెంబరులో ఫస్ట్‌ సాంగ్‌ వస్తుంది. త్వరలోనే డేట్‌ చెబుతాం. డిసెంబర్‌ 31కి మీకు జోష్‌ వస్తుందందని చెప్పగా ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌ ఫీలయ్యారు. పవన్‌కల్యాణ్‌ సరసన రాశీఖన్నా, శ్రీలీల నాయికలుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల రాశీఖన్నా కూడా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అలాగే పవన్‌కు సంబంధించిన షూట్‌ మొత్తం పూర్తయింది.


 

Updated Date - Nov 18 , 2025 | 02:44 PM