Harihara veeramallu: విడుదల తేదీ మారదు.. ఇండస్ట్రీ రికార్డులు మారతాయి

ABN , Publish Date - Jul 03 , 2025 | 03:03 PM

పవన్‌ నిజజీవితంలోనూ రియల్‌ హీరోనే. హరిహరవీరమల్లు చిత్రం ఆయన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది. చరిత్రను గుర్తుచేేస సినిమా ఇది

Harihara Veeramallu Trailer Launch

‘‘పవన్‌ కల్యాణ్‌ని (Pawan Kalyan)అందరూ పవర్‌స్టార్‌ అంటారు. ఈ సినిమాతో రియల్‌స్టార్‌ అంటారు. సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ ఆయన దాన్ని నిరూపించుకుంటున్నారు. అందరూ సినిమాల్లోనే హీరోగా ఉంటారు. పవన్‌ నిజజీవితంలోనూ రియల్‌ హీరోనే. ‘హరిహరవీరమల్లు’ (Harihara Veeramallu) చిత్రం ఆయన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది. చరిత్రను గుర్తుచేేస సినిమా ఇది’’ అని నిర్మాత ఏఎం రత్నం అన్నారు. పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ సినిమా ఇది జ్యోతికృష్ణ దర్శకుడు. గురువారం ఈ చిత్రం ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘ఇది పవన్‌ తొలి పాన్‌ ఇండియా సినిమా. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించాం. ట్రైలర్‌ ఫ్యాన్‌ ఎవరూ ఊహించని స్థాయిలో ఉంది. ఆయనతో ఇలాంటి పాన్‌ ఇండియా మూవీ తీయాలని ‘ఖుషి’ సమయంలోనే అనుకున్నాను. ఐదు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం మీ ముందుకు వస్తుంది. పవన్‌ కూడా ఈ ట్రైలర్‌ ఏడు సార్లు చూశారు. ప్రేక్షకులకు పక్కాగా కనెక్ట్‌ అవుతుంది. చరిత్రను గుర్తుచేస్తుంది. ‘ఛావా’ సినిమా చూసి ఎంతోమంది భాివోద్వేగానికి గురయ్యారు. ఇది కూడా అలాంటి కమర్షియల్‌ సినిమానే. ఈ క్రెడిట్‌ మొత్తం దర్శకుడు జ్యోతికృష్ణకే దక్కుతుంది. బెటర్‌ అవుట్‌పుట్‌ కోసం ఎంతో కష్టపడ్డాడు’’ అని అన్నారు.


Harihara veeramallu.jpg

 ఆ పిచ్చి రాతలు కంచుకోటను కదిలించలేవు: జ్యోతి కృష్ణ

‘‘తుఫాను వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ తర్వాత కొంతమంది గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వాళ్లు ఎవరో, ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. ఈ సినిమా ప్రారంభం నుంచి వాళ్లు నెగెటివ్‌గా ప్రచారం చేస్తూనే ఉన్నారు. సినిమా ఆగిపోయింది.. డబ్బు లేదు.. పూర్తి కాదు.. సినిమా రాదు అని కామెంట్‌ చేస్తూనే ఉన్నారు. వాళ్లందరికీ ఒక్కటే చెబుతున్నాను. ఈ చిత్రం ప్రారంభమై ఐదేళ్లు అయింది. కొవిడ్‌ సమయంలో కొన్ని రోజులు ఆగిపోయింది. అయినా మా వర్క్‌ ఆగలేదు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి. పవన్‌ మంచి ఫలితాలను సొంతం చేసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అయినా వాళ్లు ప్రచారం మాత్రం ఆపలేదు. కానీ, మేము ఎక్కడా నోరు జారలేదు. మా పని మేం చేసుకుంటూనే ఉన్నాం. వాళ్లు రాసే పిచ్చి రాతలు నెగెటివ్‌ కామెంట్స్‌ కంచుకోటను కదిలించలేవు. అభిమానులను కూడా ఆపలేవు. అలాగే చాలామంది ఈ సినిమాకు బడ్జెట్‌ ఎక్కువైంది. వర్క్‌వుట్‌ అవుతుందా అన్నారు.

వాళ్లందరికీ ఒక్కటే చెబుతున్నా. పవన్‌కల్యాణ్‌ ఇమేజ్‌కు ఎంత బడ్జెట్‌ అయినా తక్కువే అవుతుంది. ఏఎం రత్నం సినిమాలన్నీ పెద్ద బడ్జెట్‌ సినిమాలే. అది గుర్తు పెట్టుకోండి. అలాగే నెగటివ్‌ ప్రచారం చేసే అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా.. ఇండస్ట్రీలో  భారీ వసూళ్లు సాధించిన మొదటి చిత్రం ‘ఖుషి’. 2001లోనే రికార్డులు సృష్టించింది. దాని తర్వాత బాక్సాఫీసు వద్ద రూ.100 కోట్లు వసూళ్లు చేసిన తెలుగు చిత్రం ‘గబ్బర్‌ సింగ్‌’. అదీ పవర్‌స్టార్‌ అంటే. ఈ సినిమాకు నేను ఒక్కడినే కష్టపడ్డాను అంటే అది తప్పు. దీనికి పునాది వేసిన క్రిష్‌గారు. ఆయనకు ధన్యవాదాలు. అలాగే త్రివిక్రమ్‌కు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మా ఒడుదొడుకుల్లో మాతో ఉన్నారు. చివరివరకూ మాతో ప్రయాణించారు. మీ అందరికీ మంచి సినిమాను అందించడం కోసమే కష్టపడ్డాం. అందుకే ఆలస్యం అయింది. ఈసారి మాత్రం విడుదల తేదీ మారదు.. ఇండస్ర్టీ రికార్డులు మారతాయి’’ అని దర్శకుడు జ్యోతి కృష్ణ చెప్పారు.

Updated Date - Jul 03 , 2025 | 03:04 PM