Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమాకైనా అదే రూల్
ABN , Publish Date - Jun 02 , 2025 | 06:31 PM
పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) సినిమా అయినా రూల్ పాటించాల్సిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమాకు సంబంధించిన అయినా చివరకు పవన్ కల్యాణ్ సినిమాకు అయినా వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదు
పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) సినిమా అయినా రూల్ పాటించాల్సిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమాకు సంబంధించిన అయినా చివరకు పవన్ కల్యాణ్ సినిమాకు అయినా వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదు. సినిమా టికెట్ ధర పెంపు సహా ఏ విషయానికి సంబంధించైనా వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (APDCM) తెలిపిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ సూచన మేరకు ‘హరిహర వీరమల్ల్లు’ నిర్మాత ఏఎం రత్నం (AM Rathnam) తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించారు. మరో పది రోజుల్లో విడుదల కానున్న తమ చిత్రానికి టికెట్ రేట్ల పెంపు, అదనపు షోలకు అనుమతి వంటి అంశాలపై తమ టీమ్ తరఫున ప్రభుత్వాన్ని సంప్రదించమని కోరుతూ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్‌కు (Bharath Bhushan) లేఖను సమర్పించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కూడా ఏఎం రత్నం కలిశారు.
పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న చిత్రమే ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). పవన్‌కల్యాణ్ హీరోగా రూపొందుతోంది. నిధి అగర్వాల్ కథానాయిక. ఇందులో పవన్ పోరాట యోధుడిగా కనిపించనున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తయింది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీలో బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రెండు పార్టులుగా విడుదల కానుంది. మొదటి భాగం ‘హరి హర వీరమల్ల్లు: పార్ట్ 1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.