HHVM: 'హరిహర వీరమల్లు' వాయిదా.. విష్ణు డేట్‌ ఇవ్వలేదట..

ABN , Publish Date - Jun 03 , 2025 | 08:33 PM

పవన్‌కల్యాణ్‌ (pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'హరిహర వీరమల్లు’ (harihara veeramallu). ఈ నెల 12న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్రం విడుదల మరోసారి వాయిదా పడిందని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


పవన్‌కల్యాణ్‌ (pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'హరిహర వీరమల్లు’ (harihara veeramallu). ఈ నెల 12న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్రం విడుదల మరోసారి వాయిదా పడిందని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దానికి కారణం సిజీ వర్క్‌ అని తెలిసింది. ఆ పనులు పూర్తి కావడానికి మరి కొంత సమయం పడుతుందట. ఆ కారణంగానే జూన్‌ 12న విడుదల కావడం లేదని సమాచారం. కానీ తాజాగా నిర్మాత ఎ.ఎం రత్నం (AM Rathnam)టికెట్‌, ధరలు, ప్రత్యేక షోలకు అనుమతి కోరుతూ ఇటీవల ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు భరత్‌ భూషణ్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో విడుదల విషయంలో అభిమానులు సతమతమవుతున్నారు. ఈ నెల 12న విడుదల ఉందా లేదా అన్నదానిపై క్లారిటీ కోరుతూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ పెడుతున్నారు.



'హరిహర వీరమల్లు'  సినిమాకు ఎలాంటి ధియేటర్స్‌ బ్లాక్‌ చేయ్యెద్దని నిర్మాత ఇప్పటికే చెప్పినట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. కొత్త రిలీజ్‌ డేట్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే జూన్‌ 20, లేదా జూన్‌ 27న రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ పరిశీలిస్తున్నారని మరో టాక్‌ నడుస్తోంది. అందుకోసం మంచు విష్ణుని జూన్‌ 27వ తేది కావాలని,'కన్నప్ప' సినిమాను వాయిదా వేసుకోవాలని కోరినట్లు టాక్‌. అందుకు విష్ణు ఒప్పుకోలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. జూన్‌ మిస్‌ అయితే  జూలైలో హరిహర వీరమల్లు రావచ్చు. అప్పుడు ఏ సినిమా వెనక్కి తగ్గుతుందో చూడాలి. అయితే ఈ ప్రచారాల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే మేకర్స్‌ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  

Updated Date - Jun 03 , 2025 | 08:33 PM