Hari Hara Veera Mallu: సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేసింది
ABN , Publish Date - Jul 15 , 2025 | 05:54 AM
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా జ్యోతి కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఏ.ఎం.రత్నం నిర్మించారు. నిధి అగర్వాల్ కథానాయిక. ఈ నెల 24న చిత్రం పాన్ ఇండియా స్థాయిలో...
పవన్‌కల్యాణ్(Pawan Kalyan) కథానాయకుడిగా జ్యోతి కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘హరిహర వీరమల్లు’ (harihara veeramallu). ఏ.ఎం.రత్నం నిర్మించారు. నిధి అగర్వాల్ కథానాయిక. ఈ నెల 24న చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్రను పోషించారు. పవన్ తొలిసారి చారిత్రక యోధుడి పాత్రను పోషించడంతో సినిమాపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇప్పటివరకూ విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకున్నాయి.
తాజాగా, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. రెండు గంటలా 42 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చింది సెన్సార్ బోర్డ్. త్వరలోనే ఈ చిత్రం నుంచి మేకింగ్ వీడియోను, ఓ శక్తిమంతమైన పాటను విడుదల చేయనుంది చిత్రబృందం. అభిమానుంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 20న వైజాగ్‌లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.