Haiku: హైకు.. ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ డ్రామా

ABN , Publish Date - Dec 08 , 2025 | 01:37 PM

డా. అరుళనందు, మాథ్యో అరుళనందు ఆధ్వర్యంలో విజన్‌ సినిమా హౌస్‌ సంస్థలో తెరకెక్కుతున్న మూడో చిత్రం ‘హైకు’. నిర్మాతల్లో ఒకరైన డాక్టర్‌ అరుళనందు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు

డా. అరుళనందు, మాథ్యో అరుళనందు ఆధ్వర్యంలో విజన్‌ సినిమా హౌస్‌ సంస్థలో తెరకెక్కుతున్న మూడో చిత్రం ‘హైకు’ (Haiku). నిర్మాతల్లో ఒకరైన డాక్టర్‌ అరుళనందు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతోంది. ఇందులో ఏగన్‌ హీరోగా నటిస్తున్నారు. కోర్ట్‌ సినిమా ఫేం శ్రీదేవి  ద్వారా గుర్తింపు పొందిన శ్రీదేవి, మిన్నల్‌ మురళి చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరైన ఫెమినా జార్జ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. యువతీ యువకుల్లోని అమాయకత్వంతో కూడిన ప్రేమ, విద్యార్థి జీవితంలో ఆశలు వారు కనే కలల నేపథ్యంలో సాగే ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ డ్రామాగా ఈ చిత్రం రానుంది. యువరాజ్‌ చిన్నసామి ఈ సినిమాకు దర్శకుడు. హరిహరన్‌తో కలిసి స్ర్కీన్‌ ప్లే రాశారు. బేబి, కోర్ట్‌ చిత్రాలకు సంగీతాన్ని అందించిన విజయ్‌ బుల్గానిన్‌ ఈ సినిమాకు స్వరకర్త. జో, కోళి పన్నై చెల్లా దురై చిత్రాలను అందించిన విజన్‌ సినిమా హౌస్‌ తన బ్యానర్‌లో రూపొందిస్తోన్న మూడో చిత్రమిది. త్వరలోనే సినిమాలోని నటీనటులకు సంబంధించిన గ్లింప్స్‌, టీజర్‌, ట్రైలర్‌ సహా ఇతర వివరాలు తెలియజేస్తామని తెలిపారు.

Updated Date - Dec 08 , 2025 | 01:39 PM