Faria Abdullah: కమెడియన్ జీవన్‌కు.. బొట్టు, దిష్టి చుక్క పెట్టిన హీరోయిన్
ABN , Publish Date - Dec 17 , 2025 | 07:00 AM
నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా మురళీ మనోహర్ తెరకెక్కించిన చిత్రం గుర్రం పాపి రెడ్డి.
‘గుర్రం పాపిరెడ్డి’ (Gurram Paapi Reddy) చిత్రం ఒక వైవిధ్యమైన కథతో రూపొందింది. ఇందులో నేను జడ్జి పాత్రను పోషించాను. కథలో కీలకమైన పాత్ర నాది. ఈ చిత్రాన్ని నేటితరం ప్రేక్షకులకు నచ్చేలా కొత్త పద్ధతిలో దర్శకుడు మురళీ మనోహర్ (Murali Manohar) తెరకెక్కించారు. కొత్తవాళ్లు తీసిన ఇలాంటి సినిమాను ఆదరిస్తే చిత్రపరిశ్రమ బాగుంటుంది. వారు మరిన్ని మంచి చిత్రాలు తీసే అవకాశం ఉంటుంది’ అని అన్నారు సీనియర్ హాస్య నటుడు బ్రహ్మానందం (Brahmanandam).
నరేశ్ అగస్త్య (Naresh Agastya), ఫరియా అబ్దుల్లా (Faria)జంటగా మురళీ మనోహర్ తెరకెక్కించిన చిత్రమిది. వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్(బాబీ) నిర్మించారు. సినిమా ఈనెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. చిత్ర దర్శకుడు మురళీ మనోహర్ మాట్లాడుతూ ‘తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా సినిమాని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తీశాం’ అని చెప్పారు.
హీరో నరేశ్ అగస్త్య మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు. నిర్మాత అమర్ బురా మాట్లాడుతూ ‘మా ట్రైలర్ చూసిన యూఎస్ మిత్రులు, డిస్ట్రిబ్యూటర్లు కంటెంట్ గురించే మాట్లాడుకుంటున్నారు’ అని చెప్పారు.
అనంతరం కమెడియన్ జీవన్ (Jeevan)మాట్లాడుతూ.. అక్కడికి వచ్చిన వారందరిలో నవ్వులు పూయించారు. బొట్టు పెట్టాలంటూ యాంకర్‌ను ఆట పట్టించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఫరియా స్వయంగా బోట్టు, దిష్టి చుక్క సైతం పెట్టి ఆశ్చర్య పరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.