OG Movie: 'గన్స్ అండ్ రోజెస్' అంటూ 'ఓజీ' క్రేజీ అప్‌డేట్..
ABN , Publish Date - Sep 14 , 2025 | 05:37 PM
‘ఓజీ’ (OG-ఓజస్ గంభీర) సినిమా విడుదల దగ్గరయ్యే కొద్దీ మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేస్తున్నారు. ఈవెంట్స్ రూపంలో ఇంకా ప్రమోషన్స్ స్టార్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా మాత్రం దుమ్ము లేపేస్తున్నారు.
‘ఓజీ’ (OG-ఓజస్ గంభీర) సినిమా విడుదల దగ్గరయ్యే కొద్దీ మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేస్తున్నారు. ఈవెంట్స్ రూపంలో ఇంకా ప్రమోషన్స్ స్టార్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా మాత్రం దుమ్ము లేపేస్తున్నారు. రోజుకో అప్‌డేట్ అన్నట్లు సినిమాకు సంబంధించి ఏదో ఒక ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. హంగ్రీ చీతా నుంచి ఫైర్ స్ట్రామ్, సువ్వి సువ్వి సాంగ్, ఓమీ స్పెషల్ గ్లింప్స్ ఇలా విడుదల చేసిన ప్రచార చిత్రాలు సోషల్ మీడియాలో మోత మోగిస్తున్నాయి. వీటన్నింటికీ తమన్ అందించిన సంగీతం హైలైట్‌గా నిలిచింది. దీంతో అభిమానులు, ప్రేక్షకుల్లో సినిమాకు విపరీతంగా క్రేజ్ పెరిగింది. అలాగే సినిమా హైప్ కూడా బాగా పెరిగింది.
తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘గన్ అండ్ రోజెన్’(Guns and Roses) అంటూ సాగే పాటను ఈ నెల 15 సాయంత్రం 4.50 గంటలకు విడుదల చేయనున్నట్టు చెబుతూ ప్రోమోను విడుదల చేశారు. ఇప్పటిదాకా వచ్చిన పాటలు, గ్లింప్స్ ఒక తరహాలో ఉంటే ‘గన్ అండ్ రోజెన్’ అంటూ విడుదల చేసిన ప్రోమో చూసి ఇందులో ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి నెలకొంది. ‘ఓజీ’ గాంభీర్యాన్ని, ప్రేమను కలుపుతూ సాగే పాట ఇదని ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఈ పాట కూడా మోస్ట్ పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని టాక్. గత ప్రచార చిత్రాలకు వచ్చినట్లే దీనికి మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. సోమవారం రాబోయే ఈ పాట కోసం అభిమానులు ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఈ పాటకు ఫిదా కావడమే కాదు.. అడిక్ట్ అయిపోవలసిందే అని మేకర్స్ ట్వీట్ చేశారు.
మరో వైపు నటి నేహాశెట్టి కూడా ఈ చిత్రం గురించి ఓ అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో తనకు సంబంధించి ఓ సర్‌ప్రైజ్ ఉందని ఆమె ఓ ఈవెంట్‌లో వెల్లడించింది. ఇప్పటిదాకా ఆమె ఈ చిత్రంలో పవన్‌తో ఓ పాటలో ఆడిపాడిందనే సమాచారం. తాజా సమాచారం ప్రకారం పాటలోనే కాకుండా కీలక సన్నివేశాల్లో కూడా ఆమె ఉందని తెలిసింది. పవన్‌కల్యాణ్, ప్రియాంక ఆరుళ్ మోహన్ జంటగా నటించిన చిత్రమిది. సుజీత్ దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 25న పాన్ ఇండియాస్థాయిలో విడుదల కానుంది.
రికార్డ్ స్థాయిలో ప్రీ బుకింగ్స్..
మరో పక్క ఓజీ ప్రీ బుకింగ్స్‌లోనూ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల కోసం ఆన్‌లైన్‌లో టికెట్లు వదలగా ఇప్పటికే 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడయినట్లు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ వెల్లడించారు.