Euphoria: డిసెంబర్‌లో.. గుణశేఖర్ ‘యుఫోరియా’
ABN , Publish Date - Oct 20 , 2025 | 07:24 AM
అంతా నూతన నటీనటులతో దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘యుఫోరియా’.
అంతా నూతన నటీనటులతో దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘యుఫోరియా’(Euphoria). భూమికా చావ్లా (Bhumika Chawla) శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. సారా అర్జున్ ( Sara Arjun), నాజర్, రోహిత్ ప్రధాన తారాగణం. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మించారు. చిత్రబృందం తాజాగా ఆదివారం విడుదల తేదీని ప్రకటించింది. డిసెంబర్ 25న ‘యుఫోరియా’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపింది.
ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌లో చిరు దరహాసంతో కూడిన లుక్‌లో భూమిక కనిపించి ఆకట్టుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే హంగులతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు యూనిట్ తెలిపింది. కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కే పోతన్.