దాచి పెట్టడానికి ఏమీ లేదు

ABN , Publish Date - Jun 26 , 2025 | 02:09 AM

మంచు విష్ణు టైటిల్‌ రోల్‌లో నటించిన ‘కన్నప్ప’ చిత్రం ఈ శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన కార్యాలయాలపై...

మంచు విష్ణు టైటిల్‌ రోల్‌లో నటించిన ‘కన్నప్ప’ చిత్రం ఈ శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన కార్యాలయాలపై బుధవారం కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ విభాగం తనిఖీలు నిర్వహించింది. మాదాపూర్‌, కావూరి హిల్స్‌లోని ఆయన ఆఫీసుల్లో రెండు బృందాలు తనిఖీలు చేశాయి. ‘కన్నప్ప’ సినిమాకి అయిన బడ్జెట్‌ వివరాలపై ఆరా తీశారు. జీఎస్టీని చెల్లింపుల్లో తేడా ఉన్నట్లు గమనించారు. దాదాపు మూడు గంటల పాటు సోదాలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. మాదాపూర్‌ లోని విష్ణు కార్యాలయానికి మోహన్‌బాబు, రచయిత కోనవెంకట్‌ వెళ్లారు. కాగా, ఈ తనిఖీలపై విష్ణు స్పందించారు. ‘ఈ విషయం గురించి మీడియా చెప్పే వరకూ నాకూ తెలియదు. అయినా ఇందులో దాచి పెట్టడానికి ఏమీ లేదు. ఎక్కడెక్కడ అప్పులు చేశామో తెలుస్తుంది’’ అని అన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 02:09 AM