భారీ టెంపుల్ సెట్
ABN , Publish Date - Jun 20 , 2025 | 04:40 AM
విరాట్ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నాగ బంధం’. అభిషేక్ నామా దర్శకత్వంలో కిశోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు...
విరాట్ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నాగ బంధం’. అభిషేక్ నామా దర్శకత్వంలో కిశోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రీకరణ కోసం కేరళలోని అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌ను వేశారు. ఇందులో ఓ కీలక సన్నివేశాన్ని, పాటను షూట్ చేస్తున్నారు. గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ అందించే ఈ పాట చిత్రీకరణలో విరాట్ కర్ణతో పాటు దాదాపు 500 మంది నృత్యకారులు పాల్గొంటున్నారు. గుప్త నిధుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విజువల్ వండర్లా ఉంటుందని మేకర్స్ తెలిపారు.