NBK 111: బాలయ్య కోసం లొకేషన్ల వేట..

ABN , Publish Date - Dec 16 , 2025 | 04:35 PM

బాలయ్య, ఆయనకు వీరసింహారెడ్డి లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ని అందించిన గోపీచంద్‌ మలినేనితో మరో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటి వరకు యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన గోపీచంద్‌ మలినేని ఈ సారి పీరియాడిక్‌ డ్రామాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.

అఖండ (Akhanda) సినిమా తరువాత బాలకృష్ణ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. అటు పొలిటికల్‌గా, ఇటు సినిమాల పరంగా బాలయ్య ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. రీసెంట్‌గా అఖండ తాండవం చిత్రంతో త్రిబుల్‌ హ్యాట్రిక్‌ను సాధించి రికార్డులను తిరగరాస్తున్నారు. బాలయ్య మాస్ ఎనర్జీకి థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. ఒక సినిమా సెట్స్‌ లో ఉండగానే మరో సినిమాను రెడీ చేసుకునే విషయంలో బాలయ్య ఎప్పుడూ ముందే ఉంటాడు. దానికి తగినట్టుగానే ఇపుడు కూడా బాలయ్య, ఆయనకు వీరసింహారెడ్డి లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ని అందించిన గోపీచంద్‌ మలినేనితో (Gopichand malineni) మరో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటి వరకు యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన గోపీచంద్‌ మలినేని ఈ సారి పీరియాడిక్‌ డ్రామాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.

నవంబర్‌ 26న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓపెనింగ్ కూడా గ్రాండ్‌గా జరిగింది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలతో చిత్ర యూనిట్ బిజీ బిజీగా ఉంది. NBK 111 పేరుగా మహారాజు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లో రెండు భిన్నమైన కాలాలకు చెందిన బాలకృష్ణ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్‌ సెట్‌ చేస్తుంది. ఈ భారీ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా లేడీ సూపర్‌స్టార్‌ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మాసీవ్ ప్రాజెక్టుకు ఎస్‌.తమన్ మ్యూజిక్‌ అందించడం మరో హైలైట్. వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై సతీష్‌ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

ఇక, సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే... దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంతార చిత్రానికి కెమెరామెన్‌గా పనిచేసిన అరవింద్ కశ్యప్‌ను ఈ సినిమాకు తీసుకోవడం మేకర్స్ విజన్‌కు నిదర్శనం. ఆ విజువల్స్ పీరియాడిక్ డ్రామాకు సరికొత్త జీవం పోస్తాయనడంలో సందేహం లేదు. అఖండ-2 సూపర్ సక్సెస్‌తో మరింత ఉత్సాహంగా ఉన్న బాలయ్య... వచ్చే ఏడాది జనవరి నుంచే NBK 111 షూటింగ్‌ను స్టార్ట్‌ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది పీరియాడికల్ డ్రామా కావడంతో... చిత్ర యూనిట్ ఇప్పుడు కేవలం సెట్స్ వేయడంపైనే కాకుండా, కథకు సరిపోయే చారిత్రక, అద్భుతమైన లొకేషన్ల కోసం ప్రత్యేకంగా వేట మొదలుపెట్టింది. యూనిట్ సభ్యుల టాక్ ప్రకారం... అటు బడ్జెట్‌ పరంగా, ఇటు మేకింగ్‌ పరంగా యూనిట్ ఎక్కడా కూడా కాంప్రమైజ్‌ అవ్వట్లేదని తెలుస్తుంది. బాలయ్య కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచేలా ఈ చిత్రాన్ని రూపొందించడానికి దర్శకుడు గోపీచంద్ మలినేని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. 

Updated Date - Dec 16 , 2025 | 04:46 PM