Gopi Galla Goa Trip: ప్రేక్షకులను వెంటాడే సినిమా.. 'గోపీ గాళ్ల గోవా ట్రిప్’
ABN, Publish Date - Nov 12 , 2025 | 07:19 AM
రోడ్ ట్రిప్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం గోపీ గాళ్ల గోవా ట్రిప్ ప్రేక్షకులను వెంటాడుతుందని మేకర్స్ రోహిత్ , శశి అన్నారు.
రోడ్ ట్రిప్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం గోపీ గాళ్ల గోవా ట్రిప్’ (Gopi Galla Goa Trip ). రోహిత్ (Rohit), శశి (Sasi) దర్శకత్వం వహించారు. సాయికుమార్, సీతారామరాజు, రమణారెడ్డి నిర్మించారు. అజిత్ మోహన్, రాజు శివరాత్రి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ నెల 14న విడుదలవుతోంది. మంగళవారం చిత్రబృందం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది.
ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ‘గతంలో మేము తెరకెక్కించిన లఘు చిత్రాలకు మంచి పేరు వచ్చింది. యువతకు చక్కని సందేశంతోపాటు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించాలనే లక్ష్యంతో ఈ చిత్రం చేశాం.
హాలీవుడ్ తరహా మేకింగ్‌తో ఎంతో కష్టపడి తెరకెక్కించాం’ అని చెప్పారు.‘కథలో ఊహించని మలుపులు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయి, కొన్నాళ్లపాటు ప్రేక్షకులను వెంటాడే సినిమా ఇది. అన్ని విభాగాలు ఎంతో శ్రమకోర్చి పనిచేసి మంచి అవుట్‌పుట్‌ను రాబట్టాయి’ అని నిర్మాతలు చెప్పారు.