Globetrotter event: ఇప్పుడు టైమ్ వచ్చేసింది
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:04 PM
'కొన్ని రోజులుగా మీరు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం ఇదే.. ఇప్పుడు సమయం ఆసన్నమైంది' అంటూ మహేష్ వీడియో వైరల్ అవుతోంది
రాజమౌళి సినిమా అంటే పాన్ వరల్డ్ ఆడియన్స్ ఎంతో ఆతురతగా ఎదురుచూస్తారు. మరి ఆయనకు మహేష్ బాబు తోడైతే ఆ క్రేజ్ వేరుగా ఉంటుంది. వీరిద్దరి కలయికలో 'ఎస్ఎస్ఎంబి 29' తెరకెక్కుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ఈవెంట్‌ను భారీ స్థాయిలో.. ఈ నెల 15న రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
ఈ వివరాలను మహేశ్ స్పెషల్ వీడియో ద్వారా గుర్తుచేశారు (GlobeTrotter). ‘సినిమా అప్‌డేట్, ఈవెంట్ గురించి కొన్ని నెలల నుంచి అడుగుతున్నారు. సమయం ఆసన్నమైంది. ఈ నెల 15న భారీ ఈవెంట్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది’ అంటూ ఈవెంట్ వివరాలు చెప్పారు మహేష్.